వర్మ కామెడీ మూవీ తీసి చాలా సంవత్సరాలైంది. కెరీర్ మొదట్లో.. మనీ.. అనగనగా ఒకరోజు సినిమాల్లో కామెడీ పండించిన వర్మ.. రెండు దశాబ్ధాల తర్వాత ఎంటర్ టైన్ మెంట్ మూవీకి శ్రీకారం చుట్టాడు. ఇందులో ఇద్దరు స్టార్స్ నటించడం విశేషం. ఇంతకీ వర్మ చేస్తున్న హాస్య భరిత చిత్రంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

 

వర్మకు దెయ్యాలు.. సెలబ్రెటీస్ తో జీవితాలతో వివాదాలు.. క్రైమ్.. బోల్డ్ కాంటెంట్ తప్ప కామెడీ ఏం తెలుసనే అనుమానం రావచ్చు. కెరీర్ మొదట్లో కాస్త నవ్వించిన వర్మ.. పదేళ్లుగా.. తన టేకింగ్ తో ఏడ్పిస్తూ.. వివాదం అనే కర్చీఫ్ తో తుడుస్తున్నాడు. ఈయన గారి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో ఆయనకే తెలియదు. ఈ క్రమంలో.. కామెడీ చేయాలని నిర్ణయించుకొని.. పవర్ స్టార్ మూవీ తీస్తున్నాడు. 

 

కల్పిత గాథ.. తన హీరో ఏదైనా రియల్ క్యారెక్టర్స్ ను పోలి ఉండే అది  యాధృశ్చికమే మినహా మరొకటి కాదంటూ పక్కదారి పట్టించే వర్మ.. పవర్ స్టార్ మూవీతో ఫుల్ గా నవ్వించనున్నాడు. చెప్పకపోయినా.. సెలబ్రెటీస్ ను పోలిన వ్యక్తులను ఎంచుకొని.. కూరలో కరివేపాకు తీసివేసినట్టు.. ఆయా పాత్రలను తీసేస్తాడు. తనదైన కథనంతో జోకర్స్ ను చేసేస్తాడు. పవర్ స్టార్ క్యారెక్టర్స్ లో పవన్.. చిరంజీవి కనిపిస్తున్నారే గానీ.. మరొకరు కాదు. ఆల్ రెడీ  రిలీజ్ చేసిన స్టిల్స్ చూస్తుంటే.. పవన్, చిరంజీవిని కామెడీ చేసేట్టే కనిపిస్తోంది. 

 

ఇలా సెలబ్రిటీస్ గాలి తీసేయడం రామ్ గోపాల్ వర్మకు కొత్తేమీ కాదు. ఆ మధ్యన తీసిన అమ్మ రాజ్యంలో కడరెడ్లు మూవీలో రాజకీయ వారసుడిని చిన్న పిల్లాడిలా చేసి కామెడీ తెప్పించాడు. ఇక పవర్ స్టార్ మూవీలో మెగా ఫ్యామిలీలో ఎందరతో కామెడీ పండిస్తాడో చూడాలి. తన సినిమాకు హైప్ రావడానికి వర్మ ఏదైనా చేస్తాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: