మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా...బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చూపించిన రాజమౌళి దర్శకత్వంలో... 350 కోట్లకి పైగానే బడ్జెట్ ని కేటాయించి పాన్ ఇండియా సినిమాగా నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా "రౌద్రం రణం రుథిరం". ఈ పాటికే "రౌద్రం రణం రుథిరం" రిలీజై వసూళ్ళ గురించి.. రికార్డ్స్ గురించి చెప్పుకోవాల్సింది. కాని ఈ సినిమా చిత్రీకరణ నిలిచిపోవడానికి చాలా కారణాలు చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకే 2021 సంక్రాంతికి రిలీజ్ అని చెప్పారు దర్శకుడు రాజమౌళి. అయితే అప్పటికి రిలీజ్ కావడం కష్టమని తెలుస్తుంది.

 

IHG

పర్మిషన్ తెచ్చుకున్నా కూడా షూటింగ్ మొదలు పెట్టడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు. బాలీవుడ్, హాలీవుడ్ నటులే కాదు ఇక్కడవారు కూడా రావడానికి ఆలోచిస్తున్నారు. ఇప్పటికే పూణె షెడ్యూల్ గండిపేట లో చేయాలని రాజమౌళి సన్నాహాలు చేశారు. అక్కడ సమస్యలు తలెత్తడంతో అక్కడ చిత్రీకరణ కుదరక ఇంకో చోటకి అన్నారు. ఇప్పుడు ఫైనల్ గా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో లో సెట్ నిర్మిస్తున్నారు. ఇక్కడ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ త్వరలో మొదలవబోతుందట. ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ స్టార్ట్ చేస్తారట రాజమౌళి.

 

IHG

ఇక ఈ సినిమాతో పాటు ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి సెట్ నిర్మిస్తున్నారు. ఆ సెట్ లో వకీల్ సాబ్ చిత్రీకరణ జరుపుతారట. ఈ సినిమా దాదాపు కంప్లీటయింది. ఇప్పుడు వేస్తున్న సెట్ లో మిగిలి ఉన్న చిత్రీకరణ పూర్తి చేయనున్నారు. ఈ రెండు భారీ చిత్రాలతో షూటింగ్ మొదలు కాబోతుంది. ఈ రెండు మొదలైతే ఇక మిగతా సినిమాలు షూటింగ్ మొదలు పెట్టడానికి మేకర్స్ రెడీ అవుతున్నారట. ప్రభాస్ పూజా హెగ్డే రాధే శ్యాం, శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ, సుకుమార్ అల్లు అర్జున్ ల పుష్ప .. చిరంజీవి కొరటాల ల ఆచార్య ..ఇలా ఒక్కొక్కటి సెట్స్ మీదకి వస్తాయని సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: