టాలీవుడ్ ఇండస్ట్రీలో 'అ!' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు ప్రశాంత్ వర్మ. యంగ్ టాలెంట్ ఉన్న డైరెక్టర్ గా వీధి లోకి దిగిన ప్రశాంత్ వర్మ మొదటి సినిమా 'అ!' లో కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్ ఇషా రెబ్బా ప్రధాన పాత్రలుగా పెట్టి నేచురల్ స్టార్ నాని నిర్మాణ సారధ్యం లో పని చేయడం జరిగింది. సినిమా కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సూపర్ డూపర్ హిట్ అవటంతో పాటు సినిమాకి జాతీయస్థాయిలో రెండు అవార్డులు కూడా రావటంతో ఇండస్ట్రీ మొత్తం ప్రశాంత్ వర్మ పేరు మారుమ్రోగింది. ఇలాంటి తరుణంలో ప్రశాంత్ వర్మ రెండో సినిమాగా రాజశేఖర్ తో కలిసి 'కల్కి' తెరకెక్కించారు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా అలరించలేదు.

 

ఇదిలా ఉండగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి సినిమా వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి చిత్రీకరణ జరిగే దశలో ఉంది. డిఫరెంట్ సబ్జెక్టుతో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రోజురోజుకీ కరోనా వైరస్ గురించి కొత్త కొత్త వార్తలు రావడంతో ప్రశాంత్ వర్మ అనుకున్న సబ్జెక్టు రోజుకో విధంగా మారుతున్నట్లు తన సహచరులకు ఈ సినిమా గురించి రోజు చెబుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఓ సినిమాకి ప్రశాంత్ వర్మ పనిచేసిన గాని టైటిల్స్లో తన పేరు వేయించు కోలేదట. ఆ వార్త ఇటీవల బయటపడింది. పూర్తి మేటర్ లోకి వెళ్తే ఆ సినిమా హిందీ 'క్వీన్'.అది తెలుగులో రీమేక్ గా 'దట్ ఈజ్ మహాలక్ష్మి' గా అనువాదం జరిగింది.

 

ఈ తరుణంలో అసలు ఈ సినిమాకి తన డైరెక్టర్ గా తన పేరు టైటిల్ లో ఎందుకు వేయించుకో లేదని అన్న విషయాల గురించి క్షుణ్నంగా వివరించారు. ప్రశాంత్ మాట్లాడుతూ. ఈ సినిమా తెలుగు రీమేక్ కి మొదటిలో డైరెక్టర్ తమన్నా భాటియాతో నీలకంఠ పని చేశారు. సినిమాకి సగం వరకు ఆయనతో పనిచేయడంతో నేను కేవలం నిర్మాత కోసం పనిచేయడం వల్ల సినిమా క్రెడిట్ మొత్తం అతనికె దక్కాలని డైరెక్టర్ తమన్నా భాటియాతో నీలకంఠ పేరు మాత్రమే ఉండాలని అందువల్లే తన పేరు వేయించుకో లేదని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. అయితే సినిమా చేయడానికి కారణం ఆ సినిమాకి సంబంధించిన నిర్మాతలు తన సన్నిహితులని అందువల్లే సినిమా చేసినట్లు చెప్పుకొచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: