చిరంజీవి తర్వాత ఆయన ఇంటి నుంచి వచ్చిన మొదటి హీరో అంటే నాగబాబు. చిరంజీవికి సూపర్ స్టార్ డమ్ వచ్చాక ఆయన హీరోగా సినిమాలు వచ్చాయి. 420, సూపర్ ఎక్స్ ప్రెస్.. వంటి సినిమాల్లో ఆయన హీరోగా నటించాడు. అనంతరం కొన్నేళ్లపాటు చిరంజీవి సినిమాలతోపాటు అనేక సినిమాల్లో ముఖ్య పాత్రలు, అతిథి పాత్రలు చేస్తూ రాణించాడు. సోషల్ మీడియా విస్తృతమయ్యాక మెగా ఫ్యామిలీ హీరోల్లో మొదటగా అభిమానులకు చేరువయింది నాగబాబు మాత్రమే. మెగా అభిమానులకు పెద్ద దిక్కుగా ఉంటూ పలు సూచనలు ఇవ్వడం.. ఉత్సాహపరచడంలో నాగబాబుదే కీలకపాత్ర.

IHG

 

చిరంజీవి కుటుంబం రాజకీయంగా కూడా ఎంటర్ అయ్యాక పరిస్థితులు మరింతగా వీరిని సోషల్ మీడియాలో ఉండేలా చేశాయి. ఇప్పటికీ నాగబాబు మెగా ఫ్యాన్స్ కు సంబంధించిన విషయాలే కాకుండా రాజకీయంగా కూడా స్పందిస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఆయన తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెలుబుచ్చారు. 2019 ఎన్నికల్లో ఆయన జనసేనలో చేరి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో సోషల్ మీడియా వేదికగా ఆయన అభిప్రాయాలు పంచుకున్నారు. రాజకీయంగా ఇతర పార్టీల నాయకులకు పంచ్ లు వేశారు. మెగా అభిమానుల నుంచి ఎక్కువ సపోర్ట్ ఉండడంతో ఆయన అభిప్రాయాలు వేగంగా వైరల్ అవడమే కాకుండా సంచలనం కూడా అయ్యాయి.

IHG

 

రీసెంట్ గా ట్విట్టర్ అకౌంట్ లో రాజకీయంగా కామెంట్లు చేయడం లేదు. కేవలం కుటుంబానికి సంబంధించిన ఫొటోలు, ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే షేర్ చేస్తున్నారు. ఇటివల నాధూరామ్ గాడ్సేపై చేసిన ట్వీట్స్ బాగా వైరల్ అయ్యాయి. యూట్యూబ్ లో కూడా నా చానెల్ నా ఇష్టం.. పేరుతో అనేక సెటైరికల్ వీడియోలు చేశారు. ప్రస్తుతం యూత్, ఫ్యాన్స్ ఉత్తేజపరుస్తూ, ఆలోచనలు రేకెత్తించేలా తన అభిప్రాయాలు పోస్ట్ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మెగా బ్రదర్ నాగబాబు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: