ఆయన చేసే సినిమాలతో సంచలనాలు సృష్టించడం మానేసి ట్విట్టేర్ కామెంట్స్ తో ఇన్ డైరెక్ట్ ఎటాక్ చేసే రాం గోపాల్ వర్మ ఇప్పుడు డైరెక్ట్ గా సినిమాలు తీసి హంగామా చేస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాలు చూస్తే వర్మ ఏ స్థాయికి దిగజారాడు అన్నది తెలుస్తుంది. ఇక క్లైమాక్స్, నగ్నం సినిమాల గురించి మాట్లాడుకోవాల్సిన పనేలేదు. లేటెస్ట్ గా ఆర్జివి పవర్ స్టార్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే సినిమా పోస్టర్స్ తో ప్రచారం మొదలుపెట్టాడు.

 

సినిమాలో మ్యాటర్ ఏమి లేకపోయినా తను చేసే ప్రచారం ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ప్రస్తుతం ఆర్జివి పవర్ స్టార్ సినిమాకు కూడా రకరకాల ప్రమోషన్స్ చేస్తున్నాడు. సినిమాలో చిరు, నాగబాబులతో పాటుగా పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ ను టచ్ చేస్తున్నాడని తెలుస్తుంది. లేటెస్ట్ గా చద్రబాబుని రివీల్ చేశాడు. ఎలక్షన్స్ తర్వాత కథ అని పవర్ స్టార్ సినిమాను ప్రమోట్ చేస్తున్న ఆర్జివి.. ఓ యాంగిల్ లో ఆలోచిస్తే పవన్ కు సపోర్ట్ గానే తీస్తాడేమో అన్న టాక్ వినిపిస్తుంది. ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్ పవన్ ఆలోచనలో ఎలా ఉన్నాయన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా చేస్తున్నాడట.

 

పర్సనల్ గా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని చెప్పే అతి కొద్ది జెన్యూన్ మాటల్లో చెప్పే వర్మ.. పవన్ కు మేలు చేసేలా పవర్ స్టార్ సినిమా చేస్తాడని కొందరి మాట. ఆర్జివిని గెస్ చేయడం కష్టం. సినిమా మీద పూర్తి నెగటివిటీ వచ్చేలా చేసుకుని అందులో విషయమేమి ఉండకుండా చేస్తాడు. మరి పవర్ స్టార్ విషయంలో కూడా అదే జరుగుతుందా లేక నిజంగానే పవన్ మీద తనకున్న కసిని.. కోపాన్ని సినిమా ద్వారా తీర్చుకుంటున్నాడా అన్నది సినిమా వస్తేనే కాని తెలియదు. ఈ సినిమాను కూడా ఏటిటి ద్వారా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు ఆర్జివి.

మరింత సమాచారం తెలుసుకోండి: