రామ్ గోపాల్ వర్మ అవకాశం చిక్కినప్పుడల్లా మెగా హీరోలను ముఖ్యంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేయడం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. అయితే వర్మకు ఈరేంజ్ లో చిరంజీవి పవన్ లపై పగ ఏర్పడటానికి కొన్ని కారణాలు పరోక్షంగా ప్రభావితం చేసాయి అంటూ ఒకప్రముఖ ఛానల్ ఆసక్తికర కథనాన్ని ప్రసారం చేయడమే కాకుండా దానికిగల కారణాలను కూడ వివరించింది.


రామ్ గోపాల్ వర్మ ఈతరహాలో రెచ్చిపోవడానికి 2011లో జరిగిన అమితాబ్ ‘భుడ్డా హోగా తెరా బాప్’ మూవీ ఫంక్షన్ లో జరిగిన సంఘటన అని ఆఛానల్ అభిప్రాయం. అప్పటికే తిరిగి సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చిరంజీవి ఆలోచిస్తున్న రోజులు అవి. అప్పట్లో చిరంజీవి పూరీ జగన్నాథ్ చెప్పిన కథకు ఓకె చేసాడని ప్రచారం జరుగుతోంది.


ఆపరిస్థితుల్లో జరిగిన అమితాబ్ మూవీ ఫంక్షన్ కు ముఖ్యతిధిగా వచ్చిన చిరంజీవిని అమితాబ్ ప్రోత్సహిస్తూ ‘మీరు రాజకీయాలు మాని వెంటనే సినిమాలలోకి రండి’ అని ఆహ్వానించాడు. దీనితో ఉద్వేగానికిలోనైన చిరంజీవి తన 150వ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వ పర్యవేక్షణ చేయాలి అంటూ తన కోరికను ఓపెన్ గా వ్యక్త పరిచి ఆతరువాత చిరంజీవి వీరిద్దరికీ హ్యాండ్ ఇచ్చి వినాయక్ వైపు వెళ్ళిపోయి ‘ఖైదీ నెంబర్ 150’ వైపు వెళ్ళిపోవడం వర్మ అవమానంగా తీసుకున్నాడు అని ఆఛానల్ అభిప్రాయం.


ఇది మాత్రమే కాకుండా ‘క్షణక్షణం’ మూవీ విడుదల అయిన తరువాత చిరంజీవి స్వయంగా వర్మను పిలిచి పవన్ కళ్యాణ్ తో ఒక మంచి సినిమాను చేయమని అప్పట్లో అడిగాడట. దీనితో వర్మ ఆనందంతో అప్పట్లో పవన్ దగ్గరకు వెళ్ళి ఒక కథ చెపితే ఆకథ నచ్చక వర్మ కథ వినిపిస్తూ ఉండగానే మధ్యలో లేచి వెళ్ళిపోయాడట. ఈవిషయాన్ని కూడ వర్మ చాల సీరియస్ గా తీసుకుని అప్పటి నుండి పవన్ ఫై కోపాన్ని పెంచుకున్నాడట. ఇలా ఈరెండు కారణాలతో పాటు మరెన్నో అనేకకారణాలు చిరంజీవి పవన్ లఫై వర్మ కోపాన్ని ప్రభావితం చేసి చివరకు ఇప్పుడు లేటెస్ట్ గా పవర్ స్టార్ మూవీని తీసే స్థాయికి తీసుకువచ్చాయి అంటూ ఆప్రముఖ ఛానల్ కథనం అనేక ఆసక్తికర విషయాలను బయటపెట్టడంతో ఆకథనం హాట్ న్యూస్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: