సినిమా ఇండస్ట్రీ కోలుకోలేని పరిస్థితులలో ఈ కరోనా సమయంలో ఉంటే రామ్ గోపాల్ వర్మ ఇలాంటి వ్యతిరేక పరిస్థితులలో వరసపెట్టి తన ఆర్జీవి వరల్డ్ ధియేటర్ ఓటీటీ స్ట్రీమ్ పై వరసపెట్టి విడుదల చేస్తున్న సినిమాల హడావిడిని చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అయిపోతున్నాయి. అనునిత్యం వివాదాలకు చిరునామాగా కొనసాగే వర్మ తీస్తున్న వివాదాస్పద మూవీ పవర్ స్టార్ మూవీ పవన్ కళ్యాణ్ జీవితానికి సంబంధంలేదు అని వర్మ బయటకు చెపుతున్నప్పటికీ ఈసినిమాలో వర్మ తీస్తున్న ప్రతి సీన్ పవన్ టార్గెట్ చేసే విధంగా డిజైన్ చేసినట్లు లీకులు వస్తున్నాయి.


ఈ సినిమాలో ‘జనసేన’ పార్టీ పేరును ‘మనసేన’ అని మార్చినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన విషయాల ఆధారంగా ఈసినిమా పూర్తిగా నడుస్తుందని అంటున్నారు. 2019 ఎన్నికల ఫలితాలు అనంతరం మానసికంగా బలహీన పడ్డిన పవన్ కళ్యాణ్ అనే విషయంపై వర్మ తన కథ కథనాలను డిజైన్ చేసినట్లు టాక్. ఈసినిమా విషయానికి సంబంధించి జూలై 16న 11 గంటలకు ఆర్జీవీ థియేటర్‌లో రిలీజ్ కాబోయే పవర్ స్టార్ ట్రైలర్‌ లో కొన్ని సెలెక్టెడ్ ఫోటోలు గడ్డి తింటావా? అనే పాటను ట్రైలర్‌ గా రిలీజ్ చేయబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

 

ఇక ఇది అంతా ఒక ఎత్తు అనుకుంటే జూలై 17వ తేదీన 11 గంటలకు సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేస్తారట. టికెట్ ఖరీదు 125 రూపాయలు అని అంటున్నారు. అయితే ఈ టిక్కెట్ కొనుక్కున్నవారు 21 జూలై 11 గంటల వరకే వాలిడిటీ ఉంటుంది. ఆ తర్వాత పవర్ స్టార్ మూవీకి వచ్చే స్పందనను బట్టి ఈ మూవీ టికెట్ ధరను 250 రూపాయలుగా నిర్ణయించాలని వర్మ ఆలోచన అని అంటున్నారు.


ఈ సినిమాలో బండ్ల గణేష్ క్యారెక్టర్ ను డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ చేస్తున్నట్లు లీకులు వస్తున్నాయి. 'అబ్బబ్బా అన్నా నువ్వు దేవుడివన్నా వచ్చే ఎన్నికల్లో విజయం మనదే అన్నా’ లాంటి పంచ్ డైలాగులు వర్మ పెలుస్తాడని టాక్. ఒక అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో పవన్ కు ఉన్న అభిమానులలో కనీసం 20 శాతం మంది ఈసినిమాను చూసినా వర్మకు ఈసినిమా విడుదలైన తొలి రోజునే దరిదాపు పది కోట్ల ఆగాయం వచ్చే అవకాశం ఉంది అన్న అంచనాలు వస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: