టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ బుల్లితెర మీద హంగామా కొనసాగిస్తుంది. జబర్దస్త్ షోతో బాగ పాపులర్ అయిన ఈ అమ్మడు సినిమాల్లో కూడా సత్తా చాటుతుంది. స్మాల్ స్క్రీన్ పై హాట్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు యాంకరింగ్ కు కొత్త కలర్ అద్దుతుంది. పెళ్లి, పిల్లలు ఇవేవి గ్లామర్ షోకి అడ్డు కాదని అనుకునేలా చేస్తుంది. జబర్దస్త్ షోలో స్కిట్స్ మాత్రమే కాదు అనసూయ అందాలు కూడా హైలెట్ గా నిలుస్తాయి. ఇక తనకు వచ్చిన ఈ క్రేజ్ ను బాగా వాడేస్తుంది అనసూయ.

 

కేవలం స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా అదరగొడుతుంది. అమ్మడు వారానికో ఫోటో షూట్ చేయాల్సిందే. ఆడియెన్స్ ను తన అందాల మత్తులో దించడం కోసం బాగా కష్టపడుతుంది అనసూయ. ఇక సోషల్ మీడియా వేదికగా ఆమె పెట్టే పిక్స్, చేసే చాట్ కూడా ఆడియెన్స్ ను అలరిస్తుంది. ఎప్పుడు రెగ్యులర్ గా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే అనసూయ సోషల్ మీడియా వేదికగా కొన్ని సెన్సేషనల్ న్యూస్ లు, హాట్ కామెంట్స్ కూడా చేసింది.

 

తనని వల్గర్ గా కామెంట్ చేసిన వారికి అదే వేదిక మీద అదే రేంజ్ లో సమాధానం చెబుతుంది అనసూయ. అమ్మడు అందాలతో ఎంత అలరిస్తుందో.. తేడా వస్తే అంతే రఫ్ ఆడించేస్తుంది. ఇక సోషల్ మీడియాలో బయట జరిగే ప్రతి విషయం మీద తన స్పందన తెలియచేస్తుంది. గ్లామర్ షో మాత్రమే కాదు సోషల్ మీడియా వేద్కగా మంచి డిస్కషన్స్ కు తావిస్తుంది అనసూయ. బ్యూటీ విత్ బ్రెయిన్ అనుకునేలా.. అనసూయ సోషల్ మీడియా హంగామా కొనసాగుతుంది.                       

మరింత సమాచారం తెలుసుకోండి: