ఇండియన్ ఫిలింఇండస్ట్రీలో పెనుసంచలనాలు సృష్టించడమే ధ్యేయంగా మొదలుపెట్టిన ‘ఆర్ ఆర్ ఆర్’ లోని మూడు ఆర్ లకు రామారావు రామ్ చరణ్ రాజమౌళిల పేర్లు పరోక్షంగా ప్రతిద్వనిస్తాయి. రాజమౌళి సినిమాలో నటించడం అంటే అదృష్టంగా భావించే రామ్ చరణ్ రామారావులు ఇప్పుడు రాజమౌళిని ‘ఆర్ ఆర్ ఆర్’ విషయమై కొన్నిప్రశ్నలు సున్నితంగా అడుగుతున్నట్లు టాక్.


తెలుస్తున్న సమాచారంమేరకు ఈమూవీని వీలైనంత త్వరలో పూర్తిచేసి తమ ఇద్దరినీ బయట పడేయమని ఈమధ్య చరణ్ జూనియర్ లు కూడపలుక్కుని రాజమౌళిని అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈసినిమా వచ్చే ఏడాది కూడ విడుదలకాలేని పరిస్థితులు ఏర్పడితే తమ కెరియర్ కు తీవ్రనష్టం జరగడమే కాకుండా తమఇద్దరికీ సుమారు 80కోట్లకు పైగా నష్టం వస్తుందని వీరిద్దరూ తమ బాధను రాజమౌళికి తమకు ఉన్నచనువుతో చెప్పుకున్నట్లు టాక్.


అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ ఎప్పటికి పూర్తి అవుతుంది అన్నస్పష్టమైన క్లారిటీ ఖచ్చితంగా రాజమౌళి చరణ్ జూనియర్ లకు ఇవ్వలేకపోతున్నాడని గాసిప్పులు వస్తున్నాయి. దీనికికారణం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో బాలీవుడ్ నటీనటులు మాత్రమే కాకుండా విదేశీ నటీనటులు కూడ ఉన్నారు. అమితాబ్ అనుపమ్ ఖేర్ ల కుటుంబాలకు కరోనా సోకిన నేపధ్యంలో మరో ఐదు ఆరు నెలల వరకు బాలీవుడ్ యాక్టర్ లు ఎవ్వరు షూటింగ్ ల దరిదాపుకు వచ్చే ఆస్కారంలేదు.


కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితులలో విదేశాల నుండి వచ్చే విమానాలు ఇప్పట్లో ఇండియాలో ల్యాండ్ అయ్యే పరిస్థితులులేవు. దీనితో ధైర్యంచేసి చరణ్ జూనియర్ లు షూటింగ్ స్పాట్ కు వచ్చినా వారితో నటించవలసి ఉన్న సహనటులు ఎవరు ఇప్పట్లో కొన్ని నెలల వరకు అందుబాటుకు వచ్చే పరిస్థితి లేదు. పైకి రాజమౌళి చెప్పకపోయినా ‘ఆర్ ఆర్ ఆర్’ వచ్చే సంవత్సరం కూడా రిలీజ్ అవ్వడం సందేహమే అన్నమాటలు వినిపిస్తున్నాయి. ఈపరిస్థితుల మధ్య కొందరు ‘ఆర్ ఆర్ ఆర్’ రెండు భాగాలుగా చేసి ఇప్పటివరకు షూట్ చేయబడ్డ సీన్స్ ను పార్ట్ -1 గా తీయవలసిన సీన్స్ ను పార్ట్ -2 గా విడుదల చేయవచ్చు  కదా అని వస్తున్న సలహాలకు జక్కన్న ఏమాత్రం స్పందన లేదని టాక్. దీనికి కారణం ‘ఆర్ ఆర్ ఆర్’ కథ రీత్యా రెండు పార్ట్ లుగా విడగొట్టి సస్పెన్స్ క్రియేట్ చేసే కథాంశం ‘ఆర్ ఆర్ ఆర్’ లో లేదని రాజమౌళి భావన అని అంటున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: