రామ్ చరణ్ కు అందరి టాప్ హీరోలతోనూ మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రభాస్ మహేష్ లతో కూడ చరణ్ కు మంచి సాన్నిహిత్యం ఉండటమే కాకుండా మహేష్ తో కలిసి కొన్ని వ్యాపార సంస్థలలో చరణ్ పెట్టుబడి పెట్టాడు అన్నలీకులు కూడ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ లో నటిస్తున్నప్పటి నుంచి చరణ్ జూనియర్ ల మధ్య వ్యక్తిగత స్నేహం బాగా పెరిగింది అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి.


ఈవార్తలకు బలం చేకూర్చేలా జూనియర్ ఆలోచనలను ఒక ముఖ్య విషయమై చరణ్ ప్రభావితం చేసాడు అంటూ ఇప్పుడు లేటెస్ట్ గా వార్తలు వస్తున్నాయి. జూనియర్ ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి అవుతున్నా అతడికంటూ ఇప్పటివరకు ఒకసొంత నిర్మాణ సంస్థను ప్రారంభించుకోలేకపోయాడు.


ఈవిషయాలలో ఇప్పటికే మహేష్ ప్రభాస్ లు చాల ముందువరసలో ఉండి తమ సొంత నిర్మాణ సంస్థలను పరుగులు తీయిస్తున్నారు. దీనితో ప్రస్తుతం జూనియర్ రామ్ చరణ్ చెప్పిన ప్లాన్ ఫాలో అవుతున్నట్లు టాక్. రానున్నరోజులలో ఈకరోనా పరిస్థితులు వల్ల టాప్ హీరోల పారితోషికంలో భారీ కోతలు పడే ఆస్కారం ఉంది కాబట్టి ఆకోతల నుండి తప్పించుకోవడానికి చరణ్ తనలాగే జూనియర్ ను కూడ ఒకసొంత నిర్మాణ సంస్థను పెట్టమని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.  


ప్రస్తుతం చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మొదలుపెట్టి వరసగా సినిమాలు తీస్తున్న పరిస్థితులలో సొంత ప్రొడక్షన్ హౌజ్ ఉండటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని లాభాలు కూడా భారీగానే వస్తాయని ఎన్టీఆర్‌ కు చరణ్ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో జూనియర్ ఈ విషయమై చాలలోతుగా ఆలోచిస్తున్నట్లు టాక్. తన తండ్రి హరికృష్ణ చిన్న కొడుకు భార్గవ్ రామ్ పేర్లు కలిసొచ్చేలా దీనికి భార్గవ్ హరి ప్రొడక్షన్స్ అనే పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టి తాను నటించే సినిమాలకు తానే నిర్మాతగా మారి పారితోషిక కోతల విషయంలో వస్తున్న ఒత్తిడి లను నుంచి తప్పించుకోవాలని ఆలోచనలు చేస్తున్నట్లు వస్తున్న లీకులు నిజం అయితే ప్రస్తుతం టాప్ యంగ్ హీరోలు అందరు తమతమ సొంత నిర్మాణ సంస్థలకే భవిష్యత్ లో తమ డేట్స్ ఇచ్చే ఆస్కారం ఉంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: