కరోనా రక్కసి కారణంగా థియేటర్లు మూతబడి ఉన్నాయి. కరోనా ప్రభావం ఎప్పుడు తగ్గుతుందో, థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో థియేటర్లో బొమ్మ పడే అవకాశాలే కనిపించట్లేదు. అందువల్ల నిర్మాతలు ఇక వడ్డీల భారం మోయలేక తమ సినిమాలని అయినకాడికి ఓటీటీకి అమ్మేయాలనే చూస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో దర్శనమిచ్చాయి.

IHG

అందులో కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రం కూడా ఒకటి. అప్పటి వరకూ ఓటీటీ వేదిక మీద డైరెక్ట్ అయిన చిత్రాలేవీ సరైన స్పందన తెచ్చుకోకపోవడంతో మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ పై బాగా నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఆ నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ పెంగ్విన్ చిత్రం నెగెటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని పెద్దగా థ్రిల్ కలుగజేయలేకపోయింది.

 


దీంతో కీర్తి సురేష్ తర్వాతి సినిమాల పట్ల కొంత నెగెటివిటీ వచ్చింది. ఆమె నటించిన గుడ్ లక్ సఖీ, మిస్ ఇండియా చిత్రాలు కూడా డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ కానున్నాయని అన్నారు. ఈ రెండు చిత్రాలుకూడా లేడీ ఓరియంటెడ్ చిత్రాలే కావడం విశేషం. మహానటి సినిమా తర్వాత అన్నీ లేడీ ఓరియంటెడ్ సినిమాలనే ఒప్పుకుంటుంది. అదలా ఉంచితే ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయని చెబుతున్నారు.

 

తాజా సమాచారం ప్రకారం మిస్ ఇండియా చిత్రం ఓటీటీలో రిలీజ్ అవ్వట్లేదట. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ని ఎవ్వరికీ అమ్మలేదనీ, అందువల్ల ఓటీటీలో వస్తుందన్న వార్తలని నమ్మవద్దని చిత్రబృందం కోరింది. పరిస్థితులు నార్మల్ అయిన తర్వాత మిస్ ఇండియా రిలీజ్ అవుతుందట.అంటే థియేటర్లో వస్తుందని చెప్పినట్టే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: