కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రయోగాలకు ఎప్పుడు తాను సిద్ధం అంటుంటాడు. గజిని సినిమా టైం లోనే సూర్య విలక్షణ నటన బయటపడ్డది. అయితే ఈమధ్య ప్రయోగాలైతే చేస్తున్నాడు కాని వాటిని కమర్షియల్ సక్సెస్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడు సూర్య. చేస్తున్న ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతుంది. ప్రస్తుతం ఆకాశమే హద్దు సినిమాలో నటిస్తున్న సూర్య ఆ సినిమాతో పాటుగా ఓ వెబ్ సీరీస్ కు ఓకే చెప్పాడని తెలుస్తుంది.

 

సౌత్ స్టార్ డైరక్టర్ మణిరత్నం నిర్మాణంలో వస్తున్న నవరస వెబ్ సీరీస్ లో సూర్య నటిస్తున్నాడు. సరే సూర్య ఇమేజ్ ను వాడుకునేందుకు వెబ్ సీరీస్ లో అతన్ని తీసుకున్నారేమో అనుకోగా అందులో సూర్య హీరోగా కాదు విలన్ గా చేస్తున్నాడని తెలిసి సూర్య ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. 9 కథలు.. 9 మంది దర్శకులతో ఈ వెబ్ సీరీస్ చేయబోతున్నారట. సిద్ధార్థ్, అరవింద స్వామిల్తో పాటుగా మరికొంతమంది స్టార్స్ నటిస్తున్నారట.

 

సూర్య కూడా తన డిజిటల్ ఎంట్రీ ఈ వెబ్ సీరీస్ తో ఇస్తున్నారు. డిజిటల్ ఫ్లాట్ ఫాం కు ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. అందుకే స్టార్స్ సైతం అందుకు సై అనేస్తున్నారు. సూర్య డిజిటల్ ఎంట్రీ అదికూడా విలన్ గా అంటే కచ్చితంగా మరోసారి తన ప్రతిభ చాటేలా ఉన్నాడని చెప్పొచ్చు. ఈ వెబ్ సీరీస్ ఎనౌన్స్ మెంట్ తోనే సూపర్ క్రేజ్ తీసుకురాగా అది ఎలాంటి సత్తా చాటుతుందో చూడాలి.

 

తమిళంలో వస్తున్న ఈ వెబ్ సీరీస్ ను తెలుగులో కూడా రిలీజ్ చేసేలా చూస్తున్నారు. ఎలాగు అమేజాన్, నెట్ ఫ్లిక్స్ వారు కొంటారు కాబట్టి ఈ వెబ్ సీరీస్ ను తెలుగులో కూడా అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.        

 

మరింత సమాచారం తెలుసుకోండి: