సినిమాలు చేసిన లేకపోయినా సరే పూనం కౌర్ మాత్రం సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది. తన సినిమాలు తన నటన జనాలకు గుర్తు లేవు గాని ఆమె సోషల్ మీడియాలో చేసే హడావుడి మాత్రం జనాలకు బాగానే గుర్తు ఉంది అనే చెప్పాలి. ఇప్పుడు ఆమె పెద్దగా సినిమాలు చేయడం లేదు ఆమెకు అవకాశాలు కూడా పెద్దగా రావడం లేదు అనే చెప్పాలి. టాలీవుడ్ లో చాలా మంది ఆమె చేసే సోషల్ మీడియా పోస్ట్ ల గురించి ఎదురు చూస్తూ ఉంటారు. 

 

ఇప్పుడు ఆమె సినిమాలు ఏమీ లేవు గాని ఆమె రాజకీయాలకు సంబంధించి ఏదోక విధంగా పరోక్షంగా ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ పోస్ట్ లు బాగా వైరల్ అవుతూ ఉంటాయి. సినిమా జనాలు కూడా ఆమె గురించి చాలా వరకు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆమె ఏది మాట్లాడినా లేక ఏది పోస్ట్ చేసినా సరే ప్రధాన మీడియా కూడా ఎక్కడ లేని విధంగా ఆమెకు ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటుంది. ఆమె కూడా దాదాపుగా ప్రధాన మీడియాలో హడావుడి చేస్తూ ఉంటారు. 

 

పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఆమె చేసే  పోస్ట్ లు కొన్ని వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి. ఆమెకు అందుకే మీడియా కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. సినిమాలు చేసినా లేకపోయినా సరే ఆమెకు ప్రాధాన్యత అనేది ఉంది అంటే అది సోషల్ మీడియాలో ఆమె మాట్లాడే మాటలే. ఇప్పుడు ఆమె ఒక తమిళ సినిమాలో ఒక బాలీవుడ్ సినిమాలో చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలు లాక్ డౌన్ కారణంగా ఆగిపోయాయి. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: