దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ సినిమాను ప్రమోట్ చేస్తున్న తీరు అత్యంత ఆసక్తి దాయకంగా మారింది. ఈసినిమా ప్రమోషన్స్ డోస్ పెరిగేలా పాత్రలకు సంబంధించిన కాంట్రవర్సీ ఫొటోలను రిలీజ్ చేస్తూ వర్మ అంచనాలను పెంచేస్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు ఎదో చర్చిస్తున్నట్లు కనిపిస్తున్న పోస్టర్స్ విడుదల కావడంతో అవి మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. 


ఈ మూవీతో వర్మ ఎంతవరకు సక్సస్ అందుకుంటాడో తెలియదుగాని ఈ మూవీకి విపరీతమైన ప్రచారం వస్తోంది. ఇది ఇలా ఉండగా ఈ మూవీకి సంబంధించి విడుదల చేసిన రెండు లేటెస్ట్ స్టిల్స్ లో పవన్ చంద్రబాబులు ఏదో విషయం  చర్చించుకుంటున్నట్లుగా ఒక స్టిల్  మరొక స్టిల్ లో బాబు పవన్ ని ఎదోతిడుతున్నట్లు చూపించారు. అంతేకాదు 2024 ఎన్నికల్లో నీకు కేవలం 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయని చంద్రబాబు చూపిస్తున్నట్లుగా వర్మ క్రియేట్ చేసిన సీన్ కు సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.


ఈ సినిమాను జులై 24న ఆ సినిమాను ఆర్జీవి వరల్డ్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇది ఇలా ఉండగా  హాట్ బ్యూటీ అప్సరను కూడా ఆర్జీవి ప్రమోట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడ హాట్ టాపిక్ గా మారాయి.  ప్రస్తుతం వర్మ అప్సర తో ఒక  వర్మ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


అప్సర రాణి పేరు పై 50 ఫేక్ సోషల్ మీడియా ఎకౌంట్స్ క్రియేట్ అవ్వడంతో వర్మకు షాక్ ఇచ్చే అంసంగా మారింది. టాప్ డైరెక్టర్స్ రాజమౌళి కొరటాల త్రివిక్రమ్ లాంటి వాళ్ళు ప్రస్తుత పరిస్థితులలో ఏమిచేయలేక ఖాళీగా ఉంటే  వర్మ ఇలా తన సినిమాలతో పరుగులు తీయడం ఎవరికి అర్ధం కాని విషయంగా మారింది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: