బాలీవుడ్ నటీమణి దీపికా పదుకొనే కి ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఐదు కోట్ల మంది అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. జులై 8వ తేదీన ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టి 5 కోట్ల మంది తనని ఫాలో అయినందుకు గాను, మీ ప్రేమ ఆప్యాయతలు చూపిస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు గాను మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపింది. భారతీయులలో విరాట్ కోహ్లీ(68.1 మిలియన్), ప్రియాంక చోప్రాల తర్వాత 50 మిలియన్ల ఫాలోవర్స్ ని సాధించిన సెలబ్రిటీగా దీపికా పదుకొనే రికార్డ్ సృష్టించింది. 

IHG
దీపికా పదుకొనే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలతో పాటు తన సినిమాల గురించి కూడా పోస్టులు, వీడియోలు షేర్ చేసుకుంటోంది. తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి గడిపిన రొమాంటిక్ క్షణాలను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది దీపికా పదుకొనే. బాలీవుడ్ దంపతులైన దీపికా పదుకొనే రణవీర్ సింగ్ అంటే అభిమానులకు మహా ఇష్టం అని చెప్పుకోవచ్చు. వర్కౌట్ కి సంబంధించిన అన్ని ఫోటోలను, వీడియోలను దీపికా పదుకొనే తన ఖాతాలో షేర్ చేసుకుంటోంది. సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకోవడం వల్ల ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. 


ఆమె నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను హిందీ భాష తెలిసిన ఇతర దేశస్తులు కూడా తెగ చూస్తూ ఉంటారు. మళ్లీ మన బాలీవుడ్ చిత్రాలు ఇంగ్లీష్, తమిళ్, తెలుగులో కూడా డబ్ అవుతాయి. ఈ విధంగా ఆమె నటనా చాతుర్యం ప్రపంచవ్యాప్తంగా చూస్తుంది. ఈ క్రమంలోనే ఆమె నటనా ప్రతిభకు ఎంతోమంది అభిమానులు అవుతూ సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు.

IHG

అలాగే ఆమె బాగా సెక్సీ గా ఉండే తన ఫోటోలను సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో యువకులు ఆమెను సామాజిక మాధ్యమాల వేదికగా పూజిస్తుంటారు. ఆమె ఒక్క హాట్ ఫోటో షేర్ చేస్తే పది లక్షల నుండి 20 లక్షల పైచిలుకు లైకులు వస్తాయి అంటే అతిశయోక్తి కాదు. ఏదేమైనా ఐదు కోట్ల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం నిజంగా గొప్ప విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: