స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రామ్, ఫేసుబుక్ వంటి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ప్రతిరోజు తనకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. అల వైకుంఠపురములో సినిమాలోని బుట్ట బొమ్మ పాట కి దోస స్టెప్పులు వేసిన అల్లు అర్హ కి సంబంధించిన వీడియోను కూడా అల్లుఅర్జున్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. తాను షేర్ చేసిన మరొక వీడియోలో అల్లు అర్జున్ మూడేళ్ల అర్హ తో మాట్లాడుతూ... నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగితే... నో! నేను చేసుకోను అంటూ ఆ చిన్నపాప వేరొక రూమ్ లోకి సిగ్గుపడుతూ వెళ్తుంది. ఈ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయిపోయింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Attempt number #374 #nanatrails 💖

A post shared by Allu Arjun (@alluarjunonline) on


ఈ వర్షాకాలంలో అతను తన పిల్లల భార్యతో కలిసి ఏ విధంగా సమయాన్ని గడపపోతున్నాడో కూడా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఫోటోల షేర్ చేసి చెప్పేసాడు. ప్రముఖ సెలబ్రెటీలు చనిపోయిన ప్రతి ఒక్క రోజు అతను సోషల్ మీడియాలో వాళ్ళతో పంచుకున్న క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సరోజ జి చనిపోయిన రోజు అతడు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టి డాడీ సినిమాలో తనకి సరోజ్ జి డాన్స్ కొరియోగ్రఫీ నేర్పించారని ఆమెను పొగిడాడు.

IHG

ఫాదర్స్ డే రోజు తన తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. చైనా కి భారత్ కి మధ్య జరిగిన ఘర్షణ లో చనిపోయిన భారతీయులకు హ్యాట్సాఫ్ చెప్తూ మరొక పోస్టు పెట్టాడు. మదర్స్ డే రోజు తన తల్లి నిర్మల అల్లు తో కలిసి ఫోటో దిగి ఆ ఫోటో ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. 

IHG
తను నటించిన వేదం సినిమా వచ్చి పది సంవత్సరాలు అవుతుందని అల్లు అర్జున్ ఒక పోస్ట్ పెట్టి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఒక ఇంస్టాగ్రామ్ ఖాతాలోనే అతనికి 76 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కేవలం గత ఆరు రోజుల్లోనే 6 లక్షల మంది అభిమానులు అతడిని ఫాలో అవ్వడం ప్రారంభించారు. ఇందుకు కారణం అతడి పాపులారిటీ తో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

IHG

నిజానికి మహేష్ బాబు కి 50 లక్షల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా... అతనికంటే అల్లు అర్జున్ కి ఇరవై లక్షల మంది ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం విశేషం. ఇంస్టాగ్రామ్ లో అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డి ని మాత్రమే ఫాలో అవుతాడు. ఆమెకు కూడా 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే అభిమానులకు అల్లు అర్జున్ ఫ్యామిలీ పై ఎంత ఆసక్తి, ప్రేమ, ఆప్యాయతలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: