పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమా గురించి సంచలన నిర్ణయం తీసుకొని అభిమానులను సంతోషపరుస్తున్నాడు. ఇప్పటికే మూడు సినిమాలకు ఒప్పుకొని రెండు సినిమాలు పెండింగ్లో పెట్టిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అనే చిత్రం యొక్క షూటింగ్ దాదాపు పూర్తి చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన 20 రోజుల షూటింగ్ పూర్తి అయితే సినిమా తెరకెక్కించేందుకు సిద్ధం అయినట్టే లెక్క. కొన్ని రోజుల క్రితం వరకు చిత్ర షూటింగులకు దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ కరోనా ఉద్ధృతి తగ్గిన తర్వాత సినిమా పనులను పునః ప్రారంభిద్దామని దర్శకనిర్మాతలకు చెప్పినట్టు సమాచారం. 

#vakeelsaab 😍
#waiting 🖤
అయితే ఇప్పటికే చాలా వరకు పూర్తి చేసుకున్న వకీల్ సాబ్ చిత్రాన్ని కంప్లీట్ చేసేసి 2020 సంవత్సరంలోనే విడుదల చేసేందుకు పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నాడట. చిత్ర బృందానికి కూడా ఇదే విషయం చెప్పి ఎట్టిపరిస్థితుల్లో వకీల్ సాబ్ చిత్రం ఈ సంవత్సరం లోనే విడుదల కావాలన్నట్టు సూచించారని తెలుస్తోంది. వాస్తవానికి 2020 సంవత్సరం ఇద్దరివి తప్ప మిగతా ఏ బడా హీరోల సినిమాలు విడుదల కాలేదు. దీంతో పవన్ కళ్యాణ్ తన వకీల్ సాబ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చి 2020 సంవత్సరం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలని ఆలోచిస్తున్నారు.

IHG
ఏది ఏమైనా ఎస్. తమన్ సంగీతం కూడా వినేందుకు అభిమానులు తెగ ఆరాటపడిపోతున్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని వెండితెరపై చూసేందుకు లక్షల మంది అభిమానులు వేచి చూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. వారి కోసమేనా వకీల్ సాబ్ సినిమా అతి త్వరలోనే విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాడు. మరి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఎంత త్వరగా విడుదల అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: