బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ ల తర్వాత యువ నటుడు ‘ధోని’ ఫేమ్ సుశాంత్ రాజ్ పూత్ ఆత్మహత్య బాలీవుడ్ ఇండస్ట్రీని ఉలిక్కి పడేలా చేసింది.  ఎంతో మంచి భవిష్యత్ ఉన్న మంచి నటుడు ఆత్మహత్య చేసుకోవడం ఏంటీ అన్న షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. సుశాంత్ రాజ్ పూత్ ఆత్మహత్య ఆయన అభిమానులతో పాటు బాలీవుడ్ వర్గాల వారిని కూడా తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఇక బాలీవుడ్ లో చాలా కాలంగా ఉన్న నెపొటిజం (బంధుప్రీతి) గురించి చర్చ జరుగుతోంది. బాలీవుడ్లో నెపొటిజంను సమర్ధించే వారిని సోషల్ మీడియా ద్వారా ఎండగడుతున్నారు. ఇదే సమయంలో పోలీసులు సుశాంత్ ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేసే పనిలో ఉన్న విషయం తెలిసిందే.  

IHG

తన గురించి కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్న కారణంగా లేదంటే తన ప్రేమ గురించి ఎక్కువగా ప్రచారం జరగడం వంటి కారణాల వల్ల ఆయన డిప్రెషన్ ఎక్కువ అయ్యి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడేమో అంటూ పోలీసులు ప్రాధమిక నిర్థారణకు వస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఐదుగురితో కూడిన బృందం దాదాపు 35 మందికి పైగా వ్య‌క్తుల‌ని విచారించింది.  సుశాంత్ కుటుంబ సభ్యులు, స‌న్నిహితులు, కొలీగ్స్  అంద‌రితో మాట్లాడారు. అతడి గదిలో అన్ని వస్తువులనూ స్వాధీనపరుచుకుని పరిశీలించారు. ఈ కేసులో విచార‌ణ ప్ర‌క్రియ‌ను ఇక ముగించాలని అధికారులు భావిస్తున్న‌ట్లు సమాచారం.

IHG

ఇప్పటివరకు చేసిన విచార‌ణ‌లో ఆత్మహత్యకు సంబంధించిన ఎటువంటి విష‌యాలు బ‌య‌ట‌కు రాలేద‌ని పోలీసులు చెబుతున్నారు. సుశాంత్‌ మరణంపై స‌మగ్ర నివేదిక‌డు రూపొందిస్తున్నామ‌న్నారు.  విచార‌ణ‌లో ఎలాంటి విష‌యాలు బ‌య‌ట‌కు రాలేద‌ని, వేర‌కొరి ప్ర‌మేయం ఉందా లేదా అనే దానిపై ఫోరెన్సిక నిపుణుల‌తో కూడా మాట్లాడ‌మ‌ని, అన్ని విష‌యాల‌పై స‌మగ్ర నివేదిక‌ని రూపొందిస్తున్నామ‌ని పోలీసులు అంటున్నారు. తుది నివేద‌క‌ని ఇంకో ప‌ది రోజుల‌లో ఉన్న‌తాధికారుల‌కి అప్ప‌గించ‌నున్నార‌ట‌. ఎలాంటి సంచ‌ల‌నాలు లేకుండానే త్వ‌ర‌లోనే ఈ కేసు క్లోజ్ కానుంద‌ని స‌మాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: