నిధి అగర్వాల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 2017 లో టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన మున్నా మైఖేల్ హిందీ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన నిధి అగర్వాల్.. నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ చిత్రం అంతగా క్లీక్ అవ్వకపోయినా.. నిధి నటనకు మరియు అందానికి ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయిపోయారు.
ఇక ఈ చిత్రం తర్వాత అఖిల్‌తో మిస్టర్ మజ్నులో నటించినా నిధికి మళ్లీ నిరాశ మిగిలింది. అయితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఇస్మార్ట్ పోరిగా మారిపోయింది నిధి అగర్వాల్. ఈ చిత్రంలో నటన పరంగానే కాకుండా.. అందాల ఆరబోతతోనూ యూత్‌ను పిచ్చెక్కించింది. ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకుపోతోంది ఈ బ్యూటి. మహేష్ బాబు బావ కొడుకు గల్ల అశోక్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో ఈమె హీరోయిన్గా నటిస్తుంది.
దాంతో పాటు మరో రెండు సినిమాలు కూడా సైన్ చేసింది నిధి. అయితే సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ నిధి చాలా యాక్టివ్‌గా ఉంటుంది. మరియు తక్కువ సమయంలోనే నిధి యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకోవడంతో పాటు ఎక్కువ మంది ఫాలోవర్స్‌ను కూడా సంపాధించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడుకు 50 లక్షలకుపైగా ఫోలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే తన సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియాలో పెడుతూ అభిమానులను అలరిస్తుంటుంది. అంతేకాకుండా.. హాట్ ఫోటోషూట్స్‌తో ఎప్పటికప్పుడు మతులు చెడగొడుతూనే ఉంటుంది నిధి అగర్వాల్. రోజుకో విధంగా హాట్‌గా దర్శనం ఇస్తూ సోషల్ మీడియానే వేడెక్కిస్తుంది.