విజయ్ దేవరకొండ వరుస పరాజయాలతో గత కొంత కాలం నుండి బాక్సాఫీస్ దగ్గర చతికల పడుతున్నాడు. చేస్తున్న సినిమాలు వరుసగా అట్టర్ ప్లాప్ లు పడటంతో ఈసారి పూరి జగన్నాథ్ తో చేయబోయే సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని సినిమా కోసం బాగా కష్ట పడుతున్నారు. గతంలో పూరీ జగన్నాథ్ కూడా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా రాకముందు ప్లాపుల్లో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే 'ఇస్మార్ట్ శంకర్' సినిమా చేసి హిట్ కొట్టాడో పూరి ఇస్ బ్యాక్ అని ఇండస్ట్రీ అంది. ఈ సౌండ్ ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో డబుల్ ట్రిపుల్ అయ్యేలా పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా తరహాలో ‘ఫైటర్’ అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అనన్య పాండే విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

IHG

కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కి సరైన విలన్ ని బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో సునీల్ శెట్టి ని రంగంలోకి దిగినట్లు వార్తలు అందుతున్నాయి. సినిమాలో విజయ్ దేవరకొండ బక్సార్ గా అలరించబోతున్నారు. ఇదే టైమ్ లో విజయ్ దేవరకొండ కి సరిగ్గా విలన్ పాత్ర ఉండటంతో ఆ పాత్రకి సునీల్ శెట్టి అయితేనే కరెక్ట్ అని  ఇటీవల పూరి జగన్నాథ్ సునీల్ శెట్టితో సంప్రదింపులు చేసి అంతా ఓకే చేసినట్లు టాక్. ఇటీవల సునీల్ శెట్టి సూపర్ స్టార్  రజనీకాంత్ నటించిన ‘దర్బార్’ సినిమాలో విలన్ పాత్ర చేయడం జరిగింది.

IHG

కాగా మళ్లీ ఇప్పుడు పూరీ జగన్నాథ్ సినిమా లో సునీల్ శెట్టి విలన్ పాత్ర కి ఒప్పుకున్నట్లు వార్తలు రావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా వచ్చి వచ్చే జులై 18 వ తారీకు కి ఏడాది కాలంలో నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ గాని ఫస్ట్ లుక్ గాని సినిమా యూనిట్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: