కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే హైప్ క్రియేట్ చేస్తూంటాయి. హీరో హీరోయిన్లు, హీరో దర్శకుడు, హీరో బ్యానర్, దర్శకుడు బ్యానర్.. ఇలా పలు కాంబినేషన్లు ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేస్తూంటాయి. బిజినెస్ వర్గాల్లో కూడా ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ఈ తరహా హైప్ క్రియేట్ అయితే ఓపెనింగ్స్ పై మంచి ఇంపాక్ట్ చూపించి కలెక్షన్లు రావడానికి దోహదపడతాయి. షూటింగ్ దశలో ఉండి అటువంటి బజ్ క్రియేట్ చేస్తున్న సినిమా ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్యసాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరెకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

IHG's dancing in the rain | telugucinema.com

 

ఇప్పటికే 80శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై ఓ వార్త ఇండస్ట్రీలో రౌండ్ అవుతోంది. హీరోయిన్ సాయి పల్లవి ఈ సినిమాలో ఓపాటకి కొరియోగ్రఫీ చేస్తుందని అంటున్నారు. సాయి పల్లవి మంచి డ్యాన్సర్. సినిమాల్లోకి రాకముందు డ్యాన్స్ షోల్లో కూడా పాల్గొంది. ఆ అనుభవంతోనే ఈ సినిమాలో ఓ పాటకు కొరియోగ్రఫీ చేస్తోందని టాక్. శేఖర్ కమ్ముల ఆమెను కొరియోగ్రఫీ చేయాలని కోరినట్టు ఇండస్ట్రీలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతానికి గాసిప్ లా ఉన్న ఈ వార్తపై అఫిషియల్ న్యూస్ టీమ్ నుంచి రావాల్స ఉంది.

IHG

 

ప్రస్తుత పరిస్థితులు సర్దుకుని షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. షూటింగ్ ప్రారంభమయ్యాక జరిగే షెడ్యూల్ లో ఈ పాట చిత్రీకరించనున్నారని సమాచారం. దాదాపు షూటింగ్ పూర్తయ్యే దశలో కరోనా, లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు అనుమతులు ఉన్నా కోవిడ్ వికృతరూపం దాల్చడంతో అందరూ వెనుకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ షూటింగ్ త్వరలో ప్రారంభిస్తారా.. లేక కోవిడ్ పరిస్థితులు కాస్త సద్దుమణిగాక ప్రారంభిస్తారో తెలియాల్సి ఉంది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: