ఇండస్ట్రీలో ఎప్పుడూ బబ్లీ హీరోయిన్స్ కే ప్రయారిటీ ఇస్తారు. ఛార్మింగ్ లుక్స్ తో కర్రాళ్లకు కనెక్ట్ అయ్యే హీరోయిన్స్ నే ప్రిఫర్ చేస్తారు. కానీ జూనియర్ దేవరకొండ మాత్రం సాడ్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ తో జోడీ కడుతున్నాడు. కంపల్సరీగా హిట్ కొట్టాల్సిన టైమ్ లో నెగిటివ్ ఇమేజ్ ఉన్న అమ్మాయితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి ఆనంద్ ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు. 

 

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ భవ్య క్రియేషన్స్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. డెబ్యుటెంట్ వినోద్ అనంతోజు దర్శకత్వంలో మిడిల్ క్లాస్ మెలడీస్ అనే లవ్ స్టోరీకి సైన్ చేశాడు.  ఈ మూవీలో వర్ష బొల్లమ్మని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇదే చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. 

 

తమిళనాట 96, బిగిల్ సినిమాలతో ఇంప్రెస్ చేసిన వర్ష తెలుగులోనూ నటించింది. 96రీమేక్ జానులో సేమ్ క్యారెక్టర్ ప్లే చేసింది. అలాగే చూసీ చూడంగానే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ రెండు సినిమాలను వర్ష సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో లాగించిందనే విమర్శలు ఉన్నాయి. ఇక దొరసానితో హీరోగా లాంచ్ అయిన ఆనంద్ కు ఫస్ట్ మూవీనే షాక్ ఇచ్చింది. 
మరి అన్నకు తగ్గ తమ్ముడిగా సూపర్ హిట్ కొట్టాల్సిన సిట్యుయేషన్ లో ఆనంద్, వర్షని హీరో, హీరోయిన్ గా తీసుకోవడం ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈ ఛాయిస్ కు మెయిన్ రీజన్ ఏంటో చూడాలి. 


సినిమా ఇండస్ట్రీలో విజయదేవరకొండకు ఫుల్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా కుర్రకారుతో పాటు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో అంత క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ.. తన తమ్ముడు ఆనంద్ ను టాలీవుడ్ కు పరిచయం చేశాడు. తొలి సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఆనంద్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: