కొరటాల సినిమాలో కెమెరామెన్ మారొచ్చు. ఆర్ట్, డైరెక్టర్ మారొచ్చు. కానీ.. మ్యూజిక్ డైెరెక్టర్ మాత్రం మారడు. డెబ్యూమూవీ మిర్చి నుంచి భరత్ అనే నేను వరకు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ సినిమా సక్సెస్ కు హెల్ప్ అయింది.

 

అయితే.. చిరంజీవితో కొరటాల తీస్తున్న ఆచార్యకు మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయాడు. దేవిశ్రీ ప్లేస్ లో మణిశర్మ వచ్చేశాడు. సక్సెస్ సెంటిమెంట్ ఎందుకు బ్రేక్ అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

కొరటాల, దేవిశ్రీ కాంబినేషన్ కు బ్రేక్ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. దర్శకుడు చిరంజీవి కోసం దేవిశ్రీ బదులు మణిశర్మతో వర్క్ చేయాల్సి వచ్చింది. వరుస ఫ్లాపులతో ఫౌడౌట్ అయిపోయిన మణిశర్మ ఇస్మార్ట్ శంకర్ ను మ్యూజికల్ హిట్ చేశాడు. ఈ ఆల్బమ్ తో ఇంప్రెస్ అయిన చిరంజీవి.. మణిశర్మను రికమెంట్ చేశాడట. మెగాస్టార్ మాటను కాదనలేక ఒప్పుకున్నాడు కొరటాల. 

 

కొరటాల, దేవిశ్రీనే కాదు.. చిరంజీవి, దేవిశ్రీది కూడా హిట్ కాంబినేషనే. శంకర్ దాదా ఎంబీబీఎస్.. ఖైదీ నెంబర్ వన్ 150 లాంటి మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150.. వంద కోట్లు కలెక్ట్ చేసిందంటే.. దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ కూడా ఒక కారణమే. 

 

కొరటాల, దేవిశ్రీ కాంబినేషన్ మారడంతో.. మణిశర్మ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడన్న ఆసక్తి నెలకొంది. రీసెంట్ గా పుట్టిన రోజు జరుపుకున్న మణిశర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమాలో ఐదు పాటలుంటాయన్నాడు. అందులో ఒక ఐటం సాంగ్ కాగా.. మరొకటి రొమాంటిక్ డ్యూయెట్ అని.. మరొకటి ఎమోషనల్ సాంగ్ గా వస్తుందని చెప్పాడు. ఆల్ రెడీ ఐటం సాంగ్ ను చిరంజీవి, రెజీనాపై చిత్రీకరించగా.. ఆచార్య ఇప్పటి వరకు 40శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. మొత్తానికి ఆచార్య సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: