కొంత కాలం సహవాసం చేస్తే.. వాళ్లు వీళ్లు..వీళ్లు వాళ్లు అవుతారంటారు. ఎన్టీఆర్ పరిస్థితి కూడా ఇంతే. ఆర్ఆర్ఆర్ కోసం రామ్ చరణ్ తో కలిసి ఏడాదిన్నర నుంచి ప్రయాణం చేస్తున్నాడు. చెర్రీ ప్రభావం తారక్ పై పడింది. మెగా హీరోలా బిజినెస్ మేన్ అయిపోయాడు. 

 

స్టార్ హీరోలందరూ సొంత బేనర్స్ తో క్యాషియర్స్ గా మారుతున్నారు. మహేశ్ జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్ బేనర్ స్థాపించి తన ప్రతి సినిమాలోనూ భాగస్వామి అవుతున్నాడు. రామ్ చరణ్ తన ఇంటి పేరునే  బేనర్ కు పెట్టి కొణిదెల ప్రొడక్షన్ స్థాపించి తొలి ప్రయత్నంగా ఖైదీ నెంబర్ 150తీశాడు. ఆ తర్వాత సైరా.. ప్రస్తుతం ఆచార్య తీస్తున్నాడు. 

 

ప్రభాస్ కు యువి క్రియేషన్స్ ఉంది. యంగ్ హీరోలు నాని, విజయ్ దేవరకొండ కూడా నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. ఎన్టీఆర్ కూడా ఇదే దారిలో నడవాలనుకుంటున్నాడు. అన్న కళ్యాణ్ రామ్ బేనర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో లవకుశ మూవీ చేశాడు. హారిక హాసిని క్రియేషన్స్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్.. త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాను నిర్మిస్తోంది. అన్నయ్య బేనర్ ఉన్నా.. తనకంటూ ఓ బేనర్ ఉండాలన్న నిర్ణయానికి ఎన్టీఆర్ వచ్చాడట. 

 

సొంత బేనర్ వలన లాభాలు వివరించి..నువ్వు కూడా ప్రొడక్షన్ హౌస్ లో నటించొచ్చుగా అని రామ్ చరణ్ ఎన్టీఆర్ కు సలహాలు ఇచ్చాడట. ఓన్ బేనర్ లో నటిస్తే.. రెమ్యునరేషన్ కు డబుల్ వస్తుందని చెప్పిన మాటలు తారక్ కు బాగా ఎక్కేశాయట. ఫ్రెండ్ ఇచ్చిన సలహాను పరిశీలిస్తున్నాడు. తండ్రి హరికృష్ణ, కొడుకులు అభయ్ రామ్.. భార్గవ రామ్ కలిసొచ్చేలా కొన్ని పేర్లు అనుకున్నాడట. అయితే ఈ బేనర్ ఇప్పట్లో తెరపైకి రాకపోవచ్చు. త్రివిక్రమ్ మూవీ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్.. వైజయంతీ మూవీస్ లో రెండు సినిమాలకు కమిట్ అయిన తారక్.. మహేశ్ మాదిరి సొంత బేనర్ తో భాగస్వామి అవుతాడేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: