ఇటీవల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన టైములో వలస కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా మంది ఇంటికి చేరుకోవాలని  రవాణా వ్యవస్థ లేకపోవడంతో కాలినడకన బయలుదేరడం జరిగింది. మండుటెండల్లో ఈ విధంగా దేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఊరు గాని ఊరు నుండి సొంతింటికి కాలినడకన మండుటెండల్లో నడవడంతో మార్గం మధ్యలోనే చాలామంది తమ ప్రాణాలు విడిచిపెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ చావుల కంటే వలస కార్మికుల చావులు ఎక్కువైపోయాయి. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం పై మరియు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ప్రజలనుండి ఒత్తిడీ రావటం జరిగింది.

 

పరిస్థితి ఇంత దారుణంగా ఉన్న టైంలో సెలబ్రిటీలు ఎవరికి వారు తమకు తోచినట్లు తగిన రీతిలో సహాయం చేశారు. కానీ నటుడు సోనూసూద్ మాత్రం వలస కార్మికులకు చేసిన సేవ తో వారికి దైవంలాగా మారిపోయాడు. దూరప్రాంతాల్లో ఉన్న వారికి బస్సులు అవసరమైతే ట్రైన్ లు కూడా ఏర్పాటు చేసి సొంత స్థలాలకు వలస కార్మికులు చేరుకోవడానికి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. అంతేకాకుండా కొంతమందికి విమానాలు కూడా ప్రత్యేకంగా బుక్ చేసి వలస కార్మికుల ను సొంత ఇంటికి చేర్చాడు. ఇటువంటి తరుణంలో తన సేవా ఇంటికి చేర్చడంతో ఆగిపోలేదని లాక్ డౌన్ కే పరిమితం కాలేదని తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం ద్వారా అర్థమవుతుంది.

 

లాక్‌డౌన్‌ టైములో సొంత ప్రాంతానికి వెళ్లిన బీహార్, ఉత్తర ప్రదేశ్, ఝార్ ఖండ్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ విధంగా ప్రాణాలు కోల్పోయిన నాలుగు వందల కుటుంబాలని రాబోయే రోజుల్లో ఆదుకుంటానని సోను సూద్ బిజీ వాళ్ళ మాట ఇచ్చారు. మృతుల కుటుంబాలకు స్థితిగతులను తెలుసుకొని వారికి ఆర్థికంగా అండగా ఉంటాను అంటూ సోను సూద్ ప్రకటించాడు. దీంతో ఈ విషయం తెలుసుకుని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవకముందే వలస కార్మికులను పట్టించుకున్నాడు ఆ తర్వాత కేంద్రం ప్రత్యేక రైలు పెట్టింది. ఇప్పుడు చనిపోయిన వలస కార్మికుల కుటుంబాలను కూడా సోను సూద్ ఆడుకుంటున్నాడు ఒక సెలబ్రిటీ కి ఉన్న మానవత్వం దేశాన్ని నడిపే వ్యవస్థకు లేకపోవడం దురదృష్టకరం అంటూ కేంద్ర ప్రభుత్వానికి సోనుసూద్ చేస్తున్న పనులు బట్టి నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: