ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ అనేది ఇప్పట్లో మొదలయ్యే అవకాశం దాదాపుగా లేదు అనే చెప్పాలి. ఈ సినిమా అసలు ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక ఈ సినిమా దర్శకుడు రాజమౌళి తో పాటుగా హీరోలు రామ్ చరణ్ కూడా షూటింగ్ కోసం చాలానే ఎదురు చూస్తున్నారు గాని ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది అనేది చెప్పలేని పరిస్థితి. టాలీవుడ్ లో ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు చాలానే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

 

అది ఏంటీ అంటే రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇప్పుడు బాగా తొందరపడుతున్నారు అని అంటున్నారు. ఈ సినిమా కోసం ఆ ఇద్దరు ఇప్పుడు చాలానే ఎదురు చూస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దానికి కారణం కూడా ఉంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అతను ఒక సినిమా చేయడానికి గానూ రెడీ అయ్యాడు. అయితే ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడుతుంది. అదే విధంగా రామ్ చరణ్ కూడా ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు గాని ఆ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేని పరిస్థితి. 

 

అందుకే ఆ ఇద్దరు ఇప్పుడు బాగా తొందపడుతున్నారు అని రామ్  చరణ్ అయితే ఇప్పుడు ఎక్కువ లేట్ అయితే కష్టం అని కూడా జక్కన్న తో చెప్పాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఎప్పుడు ఈ సినిమా చేస్తారు ఎప్పుడు ఈ సినిమా వస్తుంది అనేది చూడాల్సి ఉంది మరి. కాగా ఈ సినిమా వసూళ్ళ విషయంలో భయం మొదలయింది అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: