టాలీవుడ్ లో మహేష్ బాబు సినిమా వస్తుంది అంటే చాలు జనాలకు ఒక రేంజ్ లో పండగ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు చాలా మంది ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. దాదాపుగా అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఆయన సినిమాల కోసం చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఆయన కూడా తన సినిమాల విషయంలో చాలా వరకు జాగ్రత్తగానే వ్యవహరిస్తూ సినిమాలు చేస్తూ ఉన్నాడు అనే చెప్పాలి. ఇప్పుడు ఆయన సర్కారు వారి పాట అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. 

 

సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని భావించినా సరే అది లేట్ అయ్యే అవకాశాల్లు ఉన్నాయి అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు మహేష్ ఒక తమిళ సినిమాలో చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. అజిత్ హీరో గా వస్తున్న ఒక సినిమాలో మహేష్ బాబు గెస్ట్ రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు చాలానే చర్చలు జరుగుతున్నాయి అని వచ్చే ఏడాది ఈ  సినిమా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. 

 

టాలీవుడ్ లో చాలా వరకు కూడా ఈ సినిమాలో ఎవరు ఎవరు నటిస్తారు అనే దాని మీద చర్చ జరుగుతుంది. మహేష్సినిమా కోసం ఒక నెల రోజులు చెన్నై లో ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఎప్పుడు ఈ సినిమా వస్తుంది ఏంటీ అనేది చూడాలి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు తమిళం లో అని కూడా టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: