ఓటీటీ... ఇప్పుడు ఏ సినిమాకు అయినా సరే ఇదే ఆధారం అనే విధంగా ఉంది పరిస్థితి అనే విషయం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఏ సినిమా వచ్చినా సరే సోషల్ మీడియాలో జరిగే  హడావుడి దానిని ఓటీటీ లో విడుదల చేస్తే చేసే ప్రచారం అన్నీ కూడా ఒక రేంజ్ లో ఉంటాయి. అందుకోసం అవసరం అయితే ప్రత్యేకంగా బడ్జెట్ ని కూడా పెట్టుకుని ప్రచారం చేస్తూ ఉంటారు జనాల్లు. ఇదిలా ఇలా ఉంటే ఇప్పుడు ఓటీటీ సినిమాల్లో ఉండే కొన్ని కొన్ని కొనాల విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అది ఏంటీ అంటే ఓటీటీ సినిమాల్లో ఇప్పుడు బూతులు ఎక్కువగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. 

 

సెన్సార్ లేకపోవడంతో సోషల్ మీడియాలో సినిమాలకు సంబంధించి చేస్తున్న ప్రచారం అదే విధంగా సోషల్ మీడియాల్లో వాటి బూతులను కూడా ఎక్కువగా ప్రచారం చేయడం తో సినిమాలు ఉప్పుడు జనాలకు బాగానే వెళ్తున్నాయి అనే చెప్పాలి. ఇప్పుడు దాదాపు అన్ని సినిమాల్లో కూడా బూతులు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. దీనితో కొంత మంది ఆ సినిమాలను ఫ్యామిలీ తో చూడలేక ఒంటరి గా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూస్తున్నారు అంటే తీవ్రత ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు దాదాపు అందరూ కూడా అదే ఫాలో అవుతున్నారు. 

 

ఇప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా బూతుల రూపంలో చెప్తే జనాలకు బాగా అర్ధమవుతున్న నేపద్యంలో ఓటీటీ లో వచ్చే సినిమాలు కూడా బూతులను దే విధంగా ప్రచారం చేస్తూ వస్తున్నాయి అనే చెప్పాలి. ఇక వీటిపై విమర్శలు వచ్చినా సరే సెన్సార్ తో సంబంధం లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు విడుదల చేస్తున్నారు అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలు కూడా ఇప్పుడు దాదాపుగా అలాగే వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: