టాలీవుడ్ లో ఇప్పుడు మార్కెట్ ని పెంచుకోవడానికి జనాలు ఇతర భాషల మీద ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సరే సోషల్  మీడియా మీద ఎక్కువగా ఆధారపడుతు వస్తున్నారు. అగ్ర హీరోల సినిమాలు కూడా ఇప్పుడు మార్కెట్ ఉంటుందా లేదా అనే ఆందోళనలో దాదాపుగా ఉన్నాయి అనే చెప్పాలి. ఇప్పుడు అసలు విషయం ఏంటీ అంటే సోషల్ మీడియా విషయంలో ఇక నుంచి చాలా వరకు జాగ్రత్తగా ఉండటమే మంచిది అని టాలీవుడ్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

 

అవును సోషల్ మీడియాలో ఇప్పుడు జరుగుతున్న్ ప్రచారం విషయంలో చాలా వరకు భయపడుతున్నారు స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు. తమ తమ వార్తలను తాము చదివి ఇప్పుడు వామ్మో అనే విధంగా ఉండే పరిస్థితి ఉంది అనే చెప్పాలి.  మన తెలుగు లో ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలను బాగా వైరల్ చేస్తున్న నేపధ్యంలో ఇప్పుడు స్టార్ హీరోలు కూడా జాగ్రత్త పడుతున్నారు. ఇక నుంచి మార్కెట్ పెంచుకోవడానికి గానూ సినిమాలకు సంబంధించి వచ్చే గాసిప్స్ ని కూడా వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంది అని అంటున్నారు. 

 

అంటే ఏమీ లేదు  తమ తమ సినిమాలకు సంబంధించి వచ్చే వార్తలపై సోషల్ మీడియాలో స్పందిస్తూ వాటిని తప్పు బట్టడం లేదా వాటిని నిజమా కాదా అనేది చెప్పడం ద్వారా యాక్టివ్ గా ఉంటూ జనాలకు వినోదం పంచి మార్కెట్ ని పెంచుకునే ఆలోచనలో ఉన్నారట. ఇది ఎలా ఏంటీ అనేది ఇంకా తెలియదు గాని... సోషల్ మీడియాలో వచ్చే గాసిప్స్ ని కొన్ని అయినా తెలుసుకుని వాటికి సంబంధించి లైవ్ వీడియో లు యుట్యూబ్ లేదా డబ్బులు వచ్చే ఫ్లాట్ ఫాం లో సమాధానం ఇవ్వాలి అని వారి వారి గాసిప్స్ ని తిప్పి కొట్టాలి అని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: