డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా ‘ఫైటర్’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. వరుస పరాజయాల మీద ఉన్న పూరి జగన్నాథ్ గత ఏడాది 'ఇస్మార్ట్ శంకర్' సినిమా తో అదిరిపోయే విజయాన్ని సాధించాడు. దీంతో నెక్స్ట్ విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ పూరి స్టార్ట్ చేయటంతో అంచనాలు ఇండస్ట్రీలో మరియు ప్రేక్షకులలో విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా తరహాలో ఈ సినిమా తెరకెక్కుతున్న తరుణంలో ఈ సినిమాతో పూరి జగన్నాథ్ ఏటువంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో అని అందరు ఆసక్తిగా గమనిస్తున్నారు.

 

అంతేకాకుండా ఇటీవల తన కెరియర్ లోనే చాలా స్పెషాలిటీ సినిమా 'ఫైటర్' అంటూ పూరి జగన్నాథ్ సోషల్ మీడియాలో తెలిపారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు 40% అయిపోగా.. సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మార్చాలని నిర్మాతలలో ఒకరైన బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ పూరి జగన్నాథ్ కి సూచించాడట. మొదటి నుండి ఈ సినిమాకి పూరి మణి శర్మ ని మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నాడట. ఇలాంటి తరుణంలో నిర్మాత కరణ్ జోహార్ పాన్ ఇండియా తరహాలో ఈ సినిమా వస్తుంది కాబట్టి బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకోవాలని పూరి జగన్నాథ్ కి తెలియజేశాడు అట.

 

దీంతో పూరి జగన్నాథ్ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో భారీ స్థాయిలో విజయం సాధించాలని తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని సినిమా కోసం బాగా కష్ట పడుతున్నారట. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ మరియు పూరి స్వయంగా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా పై అంచనాలు అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ లోను తారా స్థాయిలో ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: