అలా మొదలైంది సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా  పరిచయమైన నిత్యామీనన్ ఆ తర్వాత వరుస అవకాశాలు అందిపుచ్చుకుని... స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విషయం తెలిసిందే. అయితే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను చేసుకుంటూ కెరియర్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది నిత్యమీనన్. ఇప్పటివరకు నిత్యమీనన్ ఎన్నో సినిమాల్లో నటించింది కానీ ఎక్కడ స్కిన్ షో  మాత్రం చేయలేదు. అయితే తెలుగులో నాని నిర్మాతగా కాజల్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా 'ఆ' సినిమా లో లెస్బియన్ పాత్రలో  నటించిన విషయం తెలిసిందే.



ఇలా ఎన్నో వెరైటీ పాత్రలు చేస్తూ.. వరుసగా  సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది. ఇక తాజాగా ఈ మలయాళీ బ్యూటీబాలీవుడ్  వెబ్ సిరీస్ లో నటించగా ఆ వెబ్ సిరీస్ ప్రస్తుతం ఎంతో చర్చనీయాంశంగా మారింది.. అభిషేక్ బచ్చన్ తో  కలిసి ఇటీవలే నిత్యా మీనన్ ఓ వెబ్ సిరీస్ లో నటించింది. ఇందులో నిత్యామీనన్ లెస్బీయన్ పాత్రలో నటిస్తోంది ఈ అమ్మడు . బ్రీత్ ఇంటూ ద  షాడోస్  అనే హిందీ వెబ్ సీరిస్ లో నిత్యామీనన్ పాత్ర ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది.



ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ లిప్ లాక్ కి సీన్లకు  నిత్యామీనన్ దూరంగానే ఉంది... కానీ తాజా వెబ్ సిరీస్ లో మాత్రం లెస్బియన్ పాత్రలో నటించిన నిత్యా మీనన్ తన సహనటి తో లిప్లాక్ సన్నివేశాల్లో నటించింది.. అంతే కాకుండా మరికొన్ని హాట్ సీన్స్ లో కూడా నటించడం సంచలనంగా మారిపోయింది. మొదటి నుండి గ్లామర్ పాత్రలకు స్కిన్ షోకు అంతగా ప్రాధాన్యత ఇవ్వని నిత్యామీనన్... ఇలాంటి పాత్రల్లో  నటించటం ఏమిటి అని కొంతమంది నిత్యామీనన్ పాత్ర పై విమర్శలు కూడా చేస్తున్నారు.


 ఇక మరికొంతమంది నిత్యామీనన్ లిప్ లాక్ సీన్లను  బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బ్రీత్ ఇంటూ  ద  షాడోస్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లో అభిషేక్ బచ్చన్,  నిత్యామీనన్, అమిత్ సాద్  ప్రధాన పాత్రలో నటించగా ఈ వెబ్ సిరీస్ జూలై 11 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్  అవుతుంది. ఇక ప్రస్తుతం నిత్యామీనన్ నటించిన పాత్ర వివాదాస్పదంగా మారడంతో ఈ వెబ్ సిరీస్ కి ఫ్రీగా పబ్లిసిటీ దొరుకుతుంది అని చెప్పాలి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: