పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పి ఏ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొంది 1999లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా తమ్ముడు. మంచి అంచనాలతో అప్పట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సక్సెస్ ని సాధించింది. పవన్ కళ్యాణ్ సరసన ప్రీతీ జింగ్యానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అదితి గోవిత్రికర్ ముఖ్య పాత్రలో నటించింది. దివంగత నటుడు అచ్యుత్, పవన్ కళ్యాణ్ కు అన్నగా నటించిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ బ్యానర్ పై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించారు. రమణగోగుల అద్భుతమైన సాంగ్స్ అందించిన ఈ సినిమాకు మధు అంబట్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసారు. 

IHG

ఎటువంటి గోల్ లేకుండా సరదాగా జీవితాన్ని గడుపుతున్న సుబ్బు అనే యువకుడు, బాక్సర్ అయిన అతని అన్నయ్య అనుకోకుండా ఒకానొక సందర్భంలో యాక్సిడెంట్ కి గురై ఆసుపత్రి పాలవడం, ఆ తరువాత అన్నయ్య బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలనే కోరికను తెలుసుకుని తాను అదే బాక్సింగ్ ని కష్టపడి నేర్చుకుని చివరికి విజేతగా నిలవడం జరుగుతుంది. ఈ విధంగా బాక్సింగ్ నేపథ్యంలో మంచి బంధాలు, అనుబంధాలు, హాస్యం కలగలిపి దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. 

 

ఇకపోతే ప్రస్తుతం బాబాయ్ పవన్ వలె, అబ్బాయి వరుణ్ తేజ్, యువ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు. యాక్షన్ నేపథ్యంలో పలు కమర్షియల్ హంగులతో ఈ సినిమా తెరెక్కుతున్నట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు ముద్ద, అల్లు వెంకటేష్ నిర్మాతలుగా నిర్మితం అవుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమా చాలావరకు షూటింగ్ జరుపుకుంది. అతి త్వరలో తదుపరి షెడ్యూల్ జరుపుకోనున్న ఈ సినిమా, ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్. మరి బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కిన కథతో బాబాయి పవన్ సక్సెస్ అయ్యాడు, అబ్బాయి వరుణ్ పరిస్థితి ఏంటో తెలియాలి అంటే మాత్రం మరికొద్దిరోజలు వెయిట్ చేయాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: