మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పై పలు కథనాలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి.  ఈ మూవీలో మొదట ఓ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తారని వార్తలు వచ్చాయి. దాంతో మెగా, సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అన్నారు. ఈ పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంట్రవెల్ బ్యాన్ లో ఈ పాత్ర మూవీకి హైలెట్ గా నిలవబోతున్నట్లు చెప్పారు.  మొత్తానికి మూవీ షూటింగ్ చక చకా సాగుతున్న సమయంలోనే కరోనా మహమ్మారి ఇండస్ట్రీని షట్ డౌన్ చేసేసింది. గత మూడు నెలల నుంచి సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి.. ఈ మద్య పరిమిషన్ వచ్చినా.. కరోనా భయంతో ఎవరూ ముందుకు రావడం లేదు.

 

ఇదిలా ఉంటే.. మలయాళంలో 'లూసిఫర్' మూవీ సూపర్ హిట్టైంది. ఈ చిత్రాన్ని చిరంజీవి హీరోగా రీమేక్ చేయబోతున్నారు. ప్రభాస్ తో 'సాహో'ను తెరకెక్కించిన సుజిత్ ఈ మూవీకి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇందులో విలన్ పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్ ను సంప్రదించగా... ఆయన తిరస్కరించారట. సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి మూవీలో ఏ చిన్న పాత్రల వచ్చినా ఎగిరి గంతేస్తారు.. కానీ వివేక్ ఒబేరాయ్ మాత్రం ఎందుకు వద్దనుకున్నాడో వివరాలు తెలియదు.

 

గతంలో బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయరామ’ సినిమాలో వివేక్ ఒబేరాయ్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఈ నేపథ్యంలో మళ్లీ విలన్ పాత్ర అంటే ఇబ్బంది పడి ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే  వివేక్ నో చెప్పడంతో ఆయన స్థానంలో రహమాన్ ను తీసుకున్నారట. చిరంజీవి మరో చిత్రం  'ఖైదీ నంబర్ 150'లో కూడా విలన్ పాత్రను వివేక్ తిరస్కరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: