స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం సరైనోడు. 4ఏళ్ళ క్రితం వచ్చిన ఈచిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ అనిపించుకుంది. ఇక ఈచిత్రాన్ని హిందీ లోకి డబ్ చేసి యూట్యూబ్ లో మొదటిసారి విడుదలచేయగా 150 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టింది అయితే ఆతరువాత అనివార్యకారణాల వల్ల సినిమాను యూట్యూబ్ నుండి తొలగించారు.
 
ఏడాది క్రితం సరైనోడును రీ అప్లోడ్ చేయగా తాజాగా 300మిలియన్ల వ్యూస్ ను రాబట్టి యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన మొదటి భారతీయ సినిమాగా సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం యూట్యూబ్ లోనే కాదు టీవిలో వచ్చిన ప్రతిసారి మినిమం రేటింగ్స్ ను రాబడుతుంది సరైనోడు హిందీ వెర్షన్. ఈఒక్క సినిమానే కాదు అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథమ్ హిందీ వెర్షన్ ఇప్పటివరకు యూట్యూబ్ లో 264 మిలియన్ల వ్యూస్ ను రాబట్టింది. ఈసినిమాలతో బన్ని,నార్త్ లో కూడా  ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు.
 
ఇక ప్రస్తుతం బన్ని, పుష్పలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో టాప్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించనున్న ఈచిత్రంలో బన్ని లారీ డ్రైవర్ గా కనిపించనుండగా అతనికి జోడిగా రష్మిక మందన్న నటించనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించనుండగా నిర్మించనుండగా ఈ చిత్రం తెలుగుతోపాటు కన్నడ ,మలయాళ ,తమిళ, హిందీ బాషల్లో విడుదలకానుంది. అల్లు అర్జున్ కెరీర్ లో ఇదే మొదటి పాన్ ఇండియా మూవీ కావడం గమనార్హం. అక్టోబర్ నుండి ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: