బన్నీ..గంగోత్రీ మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన అల్లు వారి అబ్బాయి. బన్నీ సినిమాలు తీసుకుంటే అన్నీ  ఒక క్రమపద్ధతిలో ఉంటాయి. ఒక్కో సినిమా బన్నీలోని నటనను బాగా  ఎలివేట్ చేసేదే. బన్నీ సినిమాలు కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకున్నవే. ఇప్పటికీ బన్నీ పాత సినిమాలు చూస్తే బాగుంటాయి, ఫ్రెష్ నెస్ అలాగే ఉంటుంది.

 

ఇక బన్నీ ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఈ రోజుకి ఈ స్థాయికి చేరుకున్నారు. బన్నీ ఈ రోజు టార్గెట్ టాలీవుడ్ టాప్ చైర్. బన్నీ నా పేరు సూర్యా మూవీ నిరాశ పరచింది. దాంతో ఎంతో ఆలోచించి త్రివిక్రం శ్రీనివాస్ తో కలసి చేసిన‌ అల వైకుంఠపురంలో సినిమా అదిరిపోయే రేంజిలో హిట్ ఇచ్చింది. ఇదీ  బన్నీ సెలెక్షన్. బన్నీ ఇలాగే తన మూవీస్ ని ఎంచుకుంటూ ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి తన వెరైటీని ఎప్పటికపుడు  చూపిస్తున్నారు. 

 

ఎక్కడా మొనాటనీ ఫీల్ కాకుండా బోర్ కొట్టకుండా జాగ్రత్త పడతారు.  ఇపుడు బన్నీ చేస్తున్న పుష్ప మూవీ పక్కా మాస్  యాక్షన్ మూవీ. ఈ మూవీ పాన్ ఇండియా రేంజిలో తీస్తున్నారు. ఈ మూవీ తరువాత బన్నీ మార్కెట్ ఇంతకు ఇంత డబుల్ అవుతుంది. ఇవన్నీ ఇలా ఉంటే బన్నీ టాప్ చైర్ మీద కన్నేయడంతో మరో ఇద్దరు హీరోలు కలవరపడుతున్నారని టాక్.

 

వారెవరో కాదు, మెగా పవర్ స్టార్ రాం చరణ్. అలాగే యంగ్ టైగర్ ఎన్టీయార్. ఈ ఇద్దరూ కూడా టాప్ చైర్ కోసం రేసులో ఉన్నవారే. అయితే గత రెండేళ్ళుగా ఈ ఇద్దరూ ఆర్.ఆర్.ఆర్ మూవీతో ఇరుక్కుపోయారు. దాంతో ఈ గ్యాప్ ని బన్నీ బాగా వాడేసుకుని ముందుకువచ్చేశాడు.

 

 ఇక ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పార్ట్ 50 శాతం మాత్రమే అయిందట. మిగిలినది ఫినిష్ చేసి మూవీ రిలీజ్ చేసేసరికి బన్నీ పుష్ప కూదా బయటకు వస్తుంది. దాంతో బన్నీ రేంజి ఇంకా బాగా పెరిగిపోతుంది. దాంతో ఆర్.ఆర్.ఆర్ హీరోలు టెన్షన్ పడుతున్నారుట. మొత్తానికి బన్నీ ప్లానింగే ప్లానింగ్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: