గౌతం తిన్ననూరి డైరక్షన్ లో నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన సినిమా జెర్సీ. క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. మళ్లీరావా సినిమాతో దర్శకుడిగా మెప్పించిన గౌతం తిన్ననూరి ప్రస్తుతం బాలీవుడ్ లో జెర్సీ రీమేక్ ప్రయత్నాల్లో ఉన్నాడు. అక్కడ ఈ సినిమాను షాహిద్ కపూర్ చేస్తుండటం విశేషం. ఇక ఆ సినిమా తర్వాత గౌతం తిన్ననూరి మరోసారి నానితో సినిమా చేస్తాడని తెలుస్తుంది.

 

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం నిన్నుకోరి డైరక్టర్ శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో శ్యాం సింగ రాయ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత మరోసారి గౌతం తిన్ననూరి డైరక్షన్ లో నాని సినిమా ఉంటుందని టాక్. జెర్సీ టైం లోనే నానికి ఓ లైన్ వినిపించడం.. నాని దాన్ని ఓకే చేయడం జరిగిందట.

 

ప్రస్తుతం కమిటైన సినిమాలను పూర్తి చేసి గౌతం తిన్ననూరితో సినిమా చేస్తాడట నాని. జెర్సీ సినిమాను చాలామంది హీరోలకు వినిపించగా నాని మాత్రమే కేవలం హాఫ్ ఆన్ అవర్ లో ఓకే చేశాడని. అంతేకాదు నాని తాను రాసుకున్న పాత్రకన్నా బాగా చేశాడని అన్నాడు గౌతం తిన్ననూరి. జెర్సీ హింది వర్షన్ పూర్తి కాగానే ఆ వెంటనే నాని సినిమా చేస్తాడట. మరి ఈ క్రేజీ కాంబినేష లో రెండో సినిమా ఎలాంటి అంచనాలతో వస్తుందో చూడాలి.                                
    

మరింత సమాచారం తెలుసుకోండి: