రవితేజ రేంజ్ పడిపోయిందా.. మాస్ మహారాజ్ చిన్న హీరో స్థాయికి పడిపోయాడా.. మినిమం గ్యారెంటీ అనే నమ్మకం పోయి, రవితేజను లైట్ తీసుకునే స్టేజ్ కు వచ్చేశాడా అంటే.. మార్గెట్ వర్గాలు అవుననే చెబుతున్నాయి. క్రాక్ సినిమాను ఉదాహరణగా చూపిస్తున్నాయి.

 

రవితేజ డిజాస్టర్స్ నుంచి బయటపడేందుకు కంప్లీట్ మాస్ ఎంటర్ టైనర్ క్రాక్ సినిమా చేస్తున్నాడు. డాన్ శీను, బలుపుతో హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ మూవీలో రవితేజ పవర్ ఫుల్ కాప్ గా నటిస్తున్నాడు. హిట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మాస్ మహారాజ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కానీ ఈ మూవీయే రవితేజ రేంజ్ ని తగ్గిస్తోంది. 

 

రాజా ది గ్రేట్ తర్వాత రవితేజకు వరుసగా నాలుగు ఫ్లాపులొచ్చాయి. టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజాతో డిజాస్టర్ లో పడిపోయాడు. ఈ ఫెయిల్యూర్స్ తో మాస్ మహారాజ్ మార్కెట్ డ్యామేజ్ అయింది. అర్జంట్ గా హిట్ కొట్టకపోతే కెరీర్ కొలాప్స్ అయ్యే ప్రమాదంలో పడిపోయాడు. అయితే ఈ డేంజరస్ సిట్యుయేషన్ లో చేసిన క్రాక్ రవితేజను మరింత ఇబ్బంది పెడుతోందని సినీజనాలు మాట్లాడుకుంటున్నారు. 

 

క్రాక్ సినిమా సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా లాక్ డౌన్ తో థియేటర్లు మూతబడ్డాయి. అన్ లాక్ స్టార్ట్ అయ్యాక కరోనా ప్రభావం మరింత పెరిగింది. సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయి అనేది తెలియడం లేదు. దీంతో క్రాక్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు నిర్మాతలు. ఇక క్రాక్ ఓటీటీలో వస్తుందనగానే రవితేజ ఇమేజ్ పై చర్చలు మొదలయ్యాయి. 

 

లాక్ డౌన్ లో కేవలం చిన్న సినిమాలు మాత్రమే ఓటీటీకి వెళ్తున్నాయి. స్టార్ హీరోలు అయితే డైరెక్ట్ డిజిటల్ రైట్స్ గురించే ఆలోచించడం లేదు. ఓ మోస్తరు స్టార్డమ్ ఉన్నోళ్లు కూడా థియేటర్ రిలీజే అంటున్నారు. మరి రవితేజ క్రాక్ ఓటీటీకి వెళ్తుందనగానే ఈ హీరో రేంజ్ పడిపోయిందనే ప్రచారం జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: