థియేటర్లు బంద్ అయ్యి దర్శక నిర్మాతలంతా ఖాళీగా ఉంటే సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ మాత్రం వరుస సినిమాలు చేస్తున్నాడు. క్లైమాక్స్, నగ్నం సినిమాలతో బి గ్రేడ్ సినిమాలతో వచ్చి షాక్ ఇచ్చిన ఆర్జివి లేటెస్ట్ గా పవర్ స్టార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా అప్సరా రాణితో థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా టైటిలేమో థ్రిల్లర్ అని పెట్టి ప్రచార చిత్రాలని మాత్రం హాట్ స్టిల్స్ రిలీజ్ చేశాడు ఆర్జివి. 

 

ఆర్జివి మార్క్ థ్రిల్లర్ సినిమాగా ఈ మూవీ వస్తుంది. ఇక హీరోతో అప్సరా రాణి హాట్ స్టిల్స్ ఎప్పటిలానే సినిమాపై ఆసక్తి పెంచేలా చేస్తున్నాయి. థ్రిల్లర్ స్టిల్స్ చూస్తే రొమాన్స్ కాదు అదో రకం అనిపించేలా ఉన్నాయి. ఇప్పటికే ఆర్జివి క్లైమాక్స్, నగ్నం సినిమాలతో తన క్రియేటివిటీ చూపించేయగా కొత్తగా థ్రిల్లర్ సినిమాతో కూడా రొమాంటిక్ టచ్ ఇచ్చేలా ఉన్నాడు. హీరో, హీరోయిన్ క్రేజీ ఫోటో షూట్ తో థ్రిల్లర్ మూవీ ప్రమోషన్ మొదలుపెట్టాడు ఆర్జివి.

 

ఎప్పటిలానే ఈ సినిమాకు కూడా వర్మ చేసిన ప్లాన్ వర్క్ అవుట్ అయ్యేలా ఉంది. క్లైమాక్స్, నగ్నం సినిమాలను మించి ఈ థ్రిల్లర్ సినిమాలో రొమాన్స్ ఉంటుందని ఫోటో షూట్ తోనే హింట్ ఇచ్చాడు ఆర్జివి. ఓ పక్క పవర్ స్టార్ మరో పక్క థ్రిల్లర్ ఈ రెండు సినిమాలతో ఆర్జివి మళ్లీ ఆడియెన్స్ కు బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడు. క్లైమాక్స్, నగ్నం సినిమాలను రిలీజ్ చేసిన ఆర్జివి వరల్డ్, శ్రేయాస్ ఈటి ఏటిటి ఫ్లాట్ ఫాం లోనే థ్రిల్లర్ సినిమా రిలీజ్ చేస్తున్నారు.                                      

మరింత సమాచారం తెలుసుకోండి: