తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలియంది కాదు. సినిమాల రికార్డులే కాదు.. పవన్ సినిమా ఫస్ట్ పోస్టర్ రీలీజ్ చేస్తేనే ఆ హంగామా ఎలా ఉంటుందో వకీల్ సాబ్ కు చూపించారు ఫ్యాన్స్. ఇంతటి భారీ క్రేజ్ పవన్ సొంతం. పవన్ పేరు వినపడితేనే ఊగిపోయే ఫ్యాన్స్ ఆయనకు సంబంధించిన విషయంలో ఇంకెంత హడావిడి చేస్తారో మరోసారి నిరూపించారు. పవన్ కు అడ్వాన్స్ బర్త్ డే విసెష్ చెప్తూ ట్విట్టర్లో తిరుగులేని రికార్డులు క్రియేట్ చేశారు.

IHG

 

ట్విట్టర్లో #AdvanceHBDPawanKalyan హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశారు. నిన్న సాయంత్రం మొదలైన పవన్ అడ్వాన్స్ బర్త్ డే విశెష్ ఈరోజు సాయంత్రం వరకూ కొనసాగింది. దీంతో పవన్ ఫ్యాన్స్ తమ సత్తా చాటారు. రికార్డులతో హోరెత్తించారు. ఏకంగా 23.7మిలియన్ ట్వీట్స్ తో ఇండియా వైడ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈరోజంతా సోషల్ మీడియాలో ఈ హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అయింది. మొన్న ఎన్టీఆర్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్ కు వచ్చిన 21.5మిలియన్ ట్వీట్స్ రికార్డ్స్ ను దాటేశారు.

IHG

 

మహేశ్ బాబు అడ్వాన్స్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్ కు 8.6మిలియన్ ట్వీట్స్, గతేడాది పవన్ కల్యాణ్ బర్త్ డే ట్వీట్స్ 10.51మిలియన్స్ వచ్చాయి. వీటిని భారీ మార్జిన్ తో అడ్వాన్స్ విసెష్ తోనే దాటేశారు పవన్ ఫ్యాన్స్. నిజానికి పవన్ కల్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న. కానీ.. ఈ మధ్య సోషల్ మీడియాలో హీరోల బర్త్ డే రోజున మాత్రమే కాకుండా అడ్వాన్స్ విసెష్ చెప్పడం ట్రెండ్ అయింది. దీంతో పవన్ ఫ్యాన్స్ తమ సత్తా చాటారు. ప్రస్తుతం వారి ముందు ఉన్న టార్గెట్ వచ్చే సెప్టెంబర్ 2న ఈ 23.7మిలియన్ ట్వీట్స్ దాటేయడమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: