మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అజ్ఞాతవాసి. అంతక ముందు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. దాంతో పవన్ కళ్యాణ్ త్రివిక్రం ల అజ్ఞాతవాసి సినిమా ఇండస్ట్రీ వర్గాలతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు..ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. చెప్పాలంటే పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

 

IHG's Agnatavasi Story Revealed

 

ఇది ఫ్యాన్స్ కి పెద్ద షాక్ అని చెప్పాలి. ఇదే తట్టుకోలేక మళ్ళీ బాక్సాఫీస్ హిట్ కొట్టి బ్యాలెన్స్ చేస్తాడనుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఆయన సినిమాలు మానేసి రాజకీయాలలోకి వెళుతున్నానన్నమాట ఇంకా పెద్ద షాకిచ్చింది. అలాగే రెండేళ్ళు గడిచిపోయాయి. అయితే అనూహ్యంగా రాజకీయాలలో మార్పులు అనుకున్న ప్లాన్స్ వర్కౌట్ కాక మళ్ళీ సినిమాలు చేయడం మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్. వస్తూనే వకీల్ సాబ్ సెట్ లో దర్శనమిచ్చారు. దిల్ రాజు నిర్మాణంలో వకీల్ సాబ్ రూపొందుతుంది.

 

IHG': S Thaman says composing <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MUSIC' target='_blank' title='music-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>music</a> for the IHG ...

 

వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 15 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని దిల్ రాజు భారీగా ప్లాన్స్ వేశారు. అవన్ని తారుమారయ్యాయి. వకీల్ సాబ్ టైటిల్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ తర్వాత వచ్చిన మగువా మగువా సాంగ్ కూడా స్లో పాయిజన్ లా జనాలకి బాగానే ఎక్కింది. అయితే ఆ తర్వాత నుంచి ఈ సినిమా నుంచి ఇక ఎలాంటి అప్‌డేట్ గాని సర్‌ప్రైజ్ గాని రాలేదు.

 

IHG IHG stunning Fan Made <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=POSTERS' target='_blank' title='poster-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>poster</a> - tollywood

 

అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకొని వకీల్ సాబ్ సినిమా నుంచి ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్ సిద్దం చేస్తున్నారట చిత్ర బృందం. ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ బర్త్ డే కి ఇంకా నెల పైనే సమయం ఉంది. సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఆరోజునే ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకి ఈ సర్‌ప్రైజ్ రానుందట. ఇక దీన్ని అర్థం అవుతుంది ఏమిటంటే వకీల్ సాబ్ 2020 లో రిలీజ్ కష్టమని.   

మరింత సమాచారం తెలుసుకోండి: