టాలీవుడ్ దర్శకరత్న గా పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ముందుగా 1972లో వచ్చిన తాతామనవడు సినిమా ద్వారా దర్శకుడిగా తెరంగేట్రం చేశారు. ఇక తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న దాసరి, ఆ తరువాత ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగారు. ఆపై అనతికాలంలోనే అప్పటి అగ్ర నటులైన రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు వంటి నటీనటులందరితో కూడా పలు సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావు, ఆ తరువాత టాలీవుడ్ అగ్ర దర్శకుడిగా మంచి పేరు దక్కించుకుని ముందుకుసాగారు. ఆయన మూవీ కెరీర్లో పలు సినిమాలకు ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు కూడా దక్కాయి. ఇకపోతే తన సినిమా కెరీర్ లో ఆ విధంగా ముందుకు సాగిన దాసరి నారాయణరావు, సినిమా పరిశ్రమలోని పలువురు దర్శకులు, నిర్మాతలు, నటుల సమస్యలను తెలుసుకుని వాటిని తీర్చేందుకు ప్రయత్నిస్తూ ఉండేవారు. 

IHG

ఆ విధంగా అందరికీ తలలో నాలుక వలే వ్యవహరిస్తూ కొనసాగేవారు. ఆ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబందించిన పలు సమస్యలను ఎప్పటికప్పుడు దాసరినారాయణరావు పరిష్కరిస్తూ పెద్ద దిక్కుగా మంచి పేరు దక్కించుకున్నారు. ఇక చివరిగా ఇటీవల మంచు విష్ణు తో కలిసి ఎర్రబస్సు సినిమాలో నటించి, ఆ సినిమాకు దర్శకత్వం కూడా వహించిన దాసరి, అనంతరం మే 30 2017 న మనందరినీ విడిచి అనంతలోకాలకు వెళ్లిపోయారు. అయితే దాసరి తర్వాత తెలుగు సినిమా పరిశ్రమకు ఎవరు పెద్ద దిక్కు అనే ప్రశ్న కొన్నాళ్లుగా కొనసాగుతూ వచ్చింది. కాగా ఇటీవల కొరోనా వ్యాధి ప్రబలడంతో సినిమా నటులు అందరిని ఒక తాటిపైకి తెచ్చి తన వంతుగా సిసిసి పేరుతో ఒక చారిటీ సంస్థను ఏర్పాటు చేశారు మెగాస్టార్. తద్వారా తాను సహా పలువురు ఇతర సినిమా ప్రముఖులు కూడా విరాళాలు సేకరించి, కరోనా కారణంగా పనుల్లేక ఇబ్బందులు పడుతున్న ఎందరో రోజువారీ సినిమా కార్మికులకు నిత్యావసర సరుకులు, భోజనం ఏర్పాటు చేశారు. 

 

అంతేకాక కొన్నాళ్లుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కూడా తలెత్తిన పలు వివాదాలను తన వంతుగా పరిష్కరిస్తూ వస్తున్నారు కూడా. కాగాఈ విధంగా టాలీవుడ్ పెద్దదిక్కుగా, తనవంతుగా సాయం చేస్తూ ముందుకు సాగుతున్న చిరంజీవి, తప్పకుండా దాసరి నారాయణరావు స్థానాన్ని భర్తీ చేస్తారని, ఇది నిజంగా ఒక శుభ పరిణామం అని, అలానే రాబోయే రోజుల్లో టాలీవుడ్ కి సంబంధించి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తన వంతుగా తీర్చేందుకు ఆయన మరింతగా సహకారం అందిస్తే బాగుంటుందని అంటున్నారు పలువురు సినీ ప్రముఖులు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగానే చిరంజీవి అందరికీ తన సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగితే టాలీవుడ్ కు మంచి జరిగినట్లే అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయమై ఏమి జరుగుతుందో తెలియాలంటే మరికొద్దిరోజలు ఆగాల్సిందే....!!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: