దశాబ్దాల క్రితం ఓ పాట హిట్టయితే రేడియోల్లో వినిపించేది. తర్వాత కాలంలో టీవీల్లో ఎక్కువగా కనిపించేది. ఇప్పుడు కాలం చాలా మారి అడ్వాన్స్ అయిపోయింది. ఓ పాట హిట్టయితే యూట్యూబ్ లో మోగిపోతోంది. లిరికల్ గా ఓ రికార్డు క్రియేట్ చేస్తే.. వీడియో అప్లోడ్ చేసాక మరిన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అయితేనే పాటకు వాల్యూ. ఈ మధ్య అలా యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అయి రికార్డులు సృష్టించిన పాట ‘ఇంకేం.. ఇంకేం.. ఇంకేం కావాలే’. రెండేళ్ల క్రితం బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘గీత గోవిందం’ సినిమాలోనిదీ పాట.

IHG

 

లిరికల్ గా పెద్ద హిట్టై.. సినిమా విజయంలో కీలకమైంది. ఇక వీడియోగా యూట్యూబ్ లో రిలీజ్ చేశాక మరిన్ని రికార్డులతో హోరెత్తించింది. ఏకంగా 172 మిలియన్స్ పైగా వ్యూస్ తో దూసుకుపోయింది. కొత్త సినిమా పాటలు రికార్డ్స్ క్రియేట్ చేయనంత వరకూ ఈ పాటదే యూట్యూబ్ లో హవా. అంతగా ఈ పాట ఫేమస్ అయిపోయింది. సినిమాలో విజయ్ దేవరకొండరష్మిక మందనా కెమిస్ట్రీ ఈ పాటకు ప్లస్ పాయింట్. సినిమాలో సన్నివేశానికి తగ్గట్టుగా ఉండడం.. సంగీతం, సాహిత్యం బాగుండడంతో యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. చెప్పాలంటే ఈ పాటకు మహరాజపోషకులు వాళ్లే.

IHG

 

టీనేజ్, యూత్ మొత్తం ఈ పాటలో తమను తాము చూసుకుని మురిసిపోయారు. గోపీ సుందర్ మ్యూజిక్ తో మాయ చేశాడు. సినిమాలోని పాటలన్నీ హిట్టయ్యాయి. అయితే.. ప్రత్యేకించి ఈ పాట సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మొదట రిలీజ్ చేశారు. లిరికల్ గా హిట్టై సినిమాపై అంచనాలను పెంచేసింది. అందుకు తగ్గట్టే ‘గీత గోవిందం’ సంచలన విజయం సాధించింది. మొత్తంగా మూడు ఫార్మాట్స్ లో ఈ పాట అదరగొట్టేసింది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: