తెలుగు సినిమా పరిశ్రమలో తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా చిన్నతనంలోనే పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న మహేష్ బాబు, అనంతరం రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా మారి తొలి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక అక్కడి నుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ వాటిని విజయాలుగా మలుచుకుని ఎందరో అభిమానులను సంపాదించిన మహేష్ బాబు, ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. ఇకపోతే మహేష్ బాబు సినిమా కెరీర్లో కెరీర్ లో ఎన్నో గొప్ప విజయాలతో పాటు కొన్ని ఫ్లాపులు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి 2017 లో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఆయన నటించిన స్పైడర్ సినిమా. 

IHG

బ్యూటిఫుల్ భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఎన్ వి ఆర్ ఆర్ సినిమా ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన స్పైడర్ మూవీ అప్పట్లో భారీ అంచనాలతో రిలీజ్ అయి పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు, శివ అనే ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా నటించారు. భారీ టెక్నికల్ వాల్యూస్ తో, అలానే భారీ ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా, కథా కథనాల్లో లోపాలవల్ల బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాలేకపోయింది. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇమేజ్ కి తగ్గ అంశాలు సినిమాలో లేకపోవడంతో పాటు, మురుగదాస్ ఎంచుకున్న పాయింట్ కూడా బలంగా లేదనే విమర్శలు అప్పట్లో గట్టిగా వినిపించాయి. ఇక మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత అతి త్వరలో మహేష్ బాబు మరొక్కమారు మురుగదాస్ తో సినిమా చేస్తారు అనే వార్త ఒక ఏడాదిగా ప్రచారం అవుతూ వస్తోంది. 

 

అయితే అది నిజమేనని, ప్రస్తుతం తనకు ఉన్న కమిట్మెంట్స్ ని పూర్తి చేసిన అనంతరం, మహేష్ బాబు మురుగదాస్ తో ఒక సినిమా చేయనున్నారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజానిజాలు ఉన్నాయో తెలియదు గానీ, ఈ సినిమా విషయమై మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం, మరొక్కమారు మురుగదాస్ తో సినిమానా, బాబోయ్ వద్దే వద్దు అంటూ తమ హీరో మహేష్ బాబును కోరుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో సినిమా అసలు ఉంటుందో లేదో తెలియాలి అంటే మాత్రం ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: