యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో కొన్నేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా సింహాద్రి. నమ్మినబంటు సింహాద్రి గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన ఈ సినిమాకి అతి పెద్ద హైలైట్ అని చెప్పాలి. అప్పట్లో ఈ సినిమా అత్యద్భుత విజయాన్ని సొంతం చేసుకుని ఎన్టీఆర్ కు తిరుగులేని మాస్ హీరోగా పేరు ప్రఖ్యాతలు, మార్కెట్ వాల్యూ ని తీసుకువచ్చింది. ఎన్టీఆర్ సరసన భూమిక చావ్లా, అంకిత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించగా, విజయ మారుతీ క్రియేటివ్స్ బ్యానర్ పై దొరస్వామిరాజు దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. 

IHG

పవర్ ఫుల్ స్టోరీ తో పాటు ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, యాక్షన్ సీన్స్, ఫైట్స్, కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్ వంటి పలు అంశాలు కలగలిపి దర్శకుడు రాజమౌళి ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇకపోతే ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఒకరకంగా ఈ సినిమాలోని పాటలన్నీ కూడా అప్పట్లో శ్రోతలను విశేషంగా అలరించాయి అనే చెప్పాలి. అయితే ముఖ్యంగా వాటిలో నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి అనే పాట అయితే మరింతగా ప్రేక్షకుల మనసులలోకి దూసుకుపోయింది. ఎన్టీఆర్ మాస్ లుక్, అదిరిపోయే డ్యాన్స్, పవర్ఫుల్ మాస్ బీతో సాగె ఈ సాంగ్ అందర్నీ అలరించింది. 

 

మరీ ముఖ్యంగా ఈ పాటకు బీ, సీ సెంటర్స్ లోని జనాలు అప్పట్లో థియేటర్లను దద్దరిల్లించేశారు. ఆ విధంగా ఎంతో గొప్ప సక్సెస్ అయిన ఈ సాంగ్, అటు యూట్యూబ్ లో కూడా మంచి వ్యూస్ దక్కించుకోవడం జరిగింది. అలానే ఇప్పటికీ కూడా ఎక్కడో ఒకచోట ఈ సాంగ్ వినబడుతూనే ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే ఎన్టీఆర్ మూవీ కెరీర్లోని బెస్ట్ సాంగ్స్ లో ఈ ఆంధ్రా సోడా బుడ్డి సాంగ్, ది బెస్ట్ సాంగ్ అని చెప్పవచ్చు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: