పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించిన సినిమా ఖుషి. 2001లో ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ డ్రామా లవ్ స్టోరీ మూవీ, అప్పట్లో అతి పెద్ద విజయం అందుకుంది. అంతకుముందు తొలిప్రేమ, తమ్ముడు, బద్రి సినిమాల వరుస సక్సెస్ లతో మంచి ఫామ్ లో ఉన్న పవన్ కళ్యాణ్, అనంతరం ఈ సినిమా సూపర్ సక్సెస్ తో ఒక్కసారిగా యువతలో విశేషమైన ఆదరణ దక్కించుకున్నారు. 

IHG

ముఖ్యంగా ఈ సినిమాలోని కథ, కథనాలు, అలానే యూత్ ని ఆకట్టుకునే విధంగా దర్శకుడు రాసుకున్న సీన్స్ అప్పటి ప్రేక్షకులను అమితంగా ఆకర్షించాయి. ఈ సినిమా ద్వారా తొలిసారిగా పవన్ కళ్యాణ్ తో జతకట్టింది హీరోయిన్ భూమిక. అలానే మెలోడీ బ్రహ్మ మణిశర్మసినిమా ద్వారా తొలిసారిగా పవన్ సినిమాకు సంగీతం అందించారు. ఇక అప్పట్లో ఈ సినిమాతో పాటు ఇందులోని సాంగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా యువతను ఒక ఊపాయి. ఈ సినిమాలో దాదాపు అన్ని పాటలు కూడా ఎంతో పెద్ద హిట్ అవ్వగా, వాటిలో ముఖ్యంగా అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా అనే సాంగ్ అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు అప్పటి ప్రేక్షకులతో థియేటర్లో విపరీతంగా విజిల్స్ కొట్టించింది. 

 

యువత మనోభావాలకు అద్దం పడుతూ, ప్రేమను గురించి తెలుపుతూ సాగే ఈ పాటకు మణిశర్మ అద్భుతమైన ట్యూన్ ని అందించారు. ఈ సాంగ్ అటు యూట్యూబ్ లో కూడా విశేషమైన ఆదరణతో ముందు సాగుతోంది. ఇక ఇప్పటికీ కూడా ఈ పాట ఎక్కడో చోట వినబడుతూనే ఉంటుంది అంటే, ఈ పాటకు ఎటువంటి  క్రేజ్ ఉందొ అర్థం చేసుకోవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో వచ్చిన సినిమాల్లోని బెస్ట్ సాంగ్స్ లో ఈ సాంగ్ కూడా ఒకటి అని చెప్పవచ్చు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: