అంచనాలను మించి ఏదైనా చేయాలంటే అది కేవలం సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మకు మాత్రమే సాధ్యమవుతుంది. కరోనా క్రైసిస్ టైంలో బాగా లాభపడ్డ డైరక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఆర్జివి ఒక్కడని మాత్రమే చెప్పొచ్చు. వెబ్ సీరీస్ లతో కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఆర్జివి ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ చేయగా మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు. అందులో అప్సరా రాణితో చేస్తున్న థ్రిల్లర్ ఒకటి కాగా.. మరోటి పవర్ స్టార్. పవన్ కళ్యాన్ టార్గెట్ తో ఆర్జివి చేస్తున్న సినిమా పవర్ స్టార్. టైటిల్ దగ్గర నుండి ప్రచార చిత్రాల వరకు అంతా పవన్ ను బాగా టార్గెట్ చేశాడు.

 

సినిమాలో విషయం ఏముంటుందో తెలియదు కాని ప్రచార చిత్రాల్లో మాత్రం సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఇక వర్మ పవర్ స్టార్ సినిమాలో చిరంజీవి, నాగబాబు, త్రివిక్రం పాత్రలు ఉన్నాయి. ఇంతకీ వర్మ పవర్ స్టార్ సినిమాపై పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఏంటి. ఆయన ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నాడు అంటే జస్ట్ ఓ చిరునవ్వు సమాధానమే అంటున్నారు. అదేంటి అంటే వర్మ ఇంత కిందా మీద పడి పవర్ స్టార్ పై ఈ రేంజ్ పబ్లిసిటీ చేస్తుంటే పవన్ మాత్రం ఇవి చూసి జస్ట్ ఓ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడట. అదే ఈ సినిమాపై పవన్ ఇచ్చిన రెస్పాన్స్ అని తెలుస్తుంది. 

 

పవర్ స్టార్ సినిమా కోసం వర్మ చేస్తున్న ప్రచారం తనపై ఏమాత్రం ఎఫెక్ట్ పడని భావిస్తున్నాడట పవన్ కళ్యాణ్. అందుకే ఆ సినిమాను చాలా లైట్ తీసుకున్నాడని అటున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత క్రిష్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: