రోజురోజుకు కరోనా వైరస్ పరిస్థితులు ఉధృతం అవుతున్న నేపధ్యంలో సీనియర్ హీరోలు టాప్ యంగ్ హీరోలు ఇలా అందరు ఎవరికీ అందుబాటులో లేకుండా తమ ఫామ్ హౌస్ లలో రక్షణ కవచాల మధ్య తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మీడియా సంస్థలకు ఇచ్చే ఇంటర్వ్యూలు కూడ ఆన్ లైన్ లోనే ఇస్తున్న పరిస్థితులలో ప్రస్తుత టాప్ హీరోల లుక్ కు సంబంధించిన ఫోటోలు ఎక్కడా లీక్ అవ్వడం లేదు.


ఇలాంటి పరిస్థితులలో జూనియర్ ఈనెల 17న ఒక ప్రత్యేక విమానంలో విజయవాడ రాబోతున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా జూనియర్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న సెలెక్ట్ మొబైల్స్ కు సంబంధించిన ఒక భారీ షో రూమ్ ను ఓపెన్ చేయడానికి తారక్ విజయవాడ వస్తున్నట్లు టాక్. ఈ విషయానికి సంబంధించి కంపెనీ నుండి ఇంకా అధికారిక పరకన రాలేదు.


ప్రస్తుతం కరోనా సమస్యలు మొదలయ్యాక జూనియర్ ఇప్పటివరకు ఎక్కడా బయట కనపడలేదు. అతడి లేటెస్ట్ లుక్ కు సంబంధించిన ఫోటోలు కూడ ఎక్కడా లీక్ కాలేదు. అయితే జూనియర్ షూటింగ్ లు లేని ఈ లాక్ డౌన్ సమయంలోని సెలెక్ట్ మొబైల్ సంస్థ కోసం ఒక యాడ్ లో ఈమధ్య నటించాడు అని తెలుస్తోంది.


ఆ యాడ్ లో జూనియర్ లుక్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు లీక్ అయ్యాయి. ఈ ఫోటోలలో జూనియర్ మొఖంలో బాగా గ్లో కనిపించడమే కాకుండా మరింత ఆకర్షణీయంగా లుక్ కనిపిస్తూ ఉండటంతో గత 4 నెలలుగా తారక్ ఇంటివద్దనే ఉండటంతో తన లుక్ ను మరింత మార్చుకున్నాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. సాధారణంగా జూనియర్ బయటకు వస్తే అతడి అభిమానులను కంట్రోల్ చేయడం అసాధ్యం. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు భౌతిక దూరం పాటిస్తూ జూనియర్ జనం మధ్య ఈ షో రూమ్ ను ఎలా ఓపెన్ చేస్తాడు అన్న ఆసక్తి టాప్ హీరోలలో కూడ ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: