చిరంజీవి కొరటాల దర్శకత్వంలో ప్రారంభం అయిన ‘ఆచార్య’ ప్రస్తుత పరిస్థితులలో మళ్ళీ ఎప్పుడు తన షూటింగ్ ను ఎప్పుడు ప్రారంభించగలదో తెలియదు. అయినా చిరంజీవి ‘ఆచార్య’ తరువాత తాను నటించబోయే సినిమాల కథలను వరసపెట్టి ఓకె చేస్తున్నాడు. ఇన్ని కథలకు సంబంధించిన సినిమాలలో చిరంజీవి ఎప్పుడు మళ్ళీ నటించి షూటింగ్ పూర్తి చేస్తాడో ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది. 


సుజిత్ దర్శకత్వంలో చిరంజీవి ‘లూసీఫార్’ రీమేక్ లో నటించడానికి ఓకె చేయడంతో ఆ సినిమా స్క్రిప్ట్ ను సుజిత్ పూర్తి చేయడమే కాకుండా ఆ సినిమాకు సంబంధించిన కీలక నటీనటులను ఎంపిక చేసేపనిలో పడ్డాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మంజూవారియర్ పాత్రకు సుహాసిని ని తీసుకున్నారు అని ప్రచారం జరుగుతున్న పరిస్థితులలో ఈ మూవీ మళయాళ వెర్షన్ లో వివేక్ ఒబెరాయ్ చేసిన పాత్రకు దక్షిణాది నటుడు రెహమాన్ ను తీసుకున్నట్లు వార్తలు ఉన్నాయి.


ఈ పరిస్థితులు ఇలా ఉంటే దర్శకుడు బాబి ఈమధ్య చిరంజీవిని కలిసి ఒక కథ లైన్ చెప్పి దానికి చిరంజీవి ఓకె చెప్పడంతో ఆ కథను ఈ లాక్ డౌన్ సమయంలో టోటల్ స్క్రిప్ట్ గా మార్చి ప్రస్తుతం చిరంజీవి అంగీకారం కోసం ఎదురు చూస్తున్నట్లు టాక్. వాస్తవానికి గతంలోనే చిరంజీవి ఈకథ విన్నాడని అయితే మెగా స్టార్ చెప్పిన కొన్ని చిన్నచిన్న మార్పులతో ఇప్పుడు బాబి ఈ ఫైనల్ స్క్రిప్ట్ ను ఫినిష్ చేసినట్లు టాక్. 


చిరంజీవి శైలికి తగ్గట్లుగా వైవిధ్య భరితమైన కథాంశంతో ఒక సామాజిక సమస్య చుట్టూ ఈ కథ తిరుగుతుంది అని అంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ జూనియర్ తో ‘జై లవ కుశ’ లాంటి భారీ సినిమాలను బాబి తీసినా టాప్ డైరెక్టర్ల లిస్టులో బాబి చేరలేకపోతున్నాడు. దీనితో చిరంజీవి చివరి నిముషంలో మనసు మార్చుకోకుండా నిజంగానే బాబికి అవకాసం ఇస్తే అతడి దశ తిరిగినట్లే అనుకోవాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: