ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హాట్ బ్యూటీ ఇలియానా డిక్రూజ్‌. టాలీవుడ్‌ లో టాప్‌ హీరోలందరితో జోడి కట్టిన ఈ భామ ప్రస్తుతం అవకాశాల్లేక ఖాళీగా ఉంది. బాలీవుడ్‌ మీద ఆశలతో సౌత్ సినిమా మీద చిన్నచూపు చూసిన ఈ బ్యూటీకి అక్కడ కూడా అవకాశాలు రాకపోవటంతో కెరీర్‌ కష్టాల్లో పడింది. దీంతో చాలా కాలంగా ఛాన్స్‌ కోసం ఎదురుచూస్తుంది ఈ బ్యూటీ.

 

ఇటీవల టాలీవుడ్‌ రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించిన పెద్దగా వర్క్ అవుట్‌ కాలేదు, అమర్‌ అక్బర్‌ ఆంటొని సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఇలియానాకు చేదు అనుభవమే మిగిలింది. బాలీవుడ్‌ కూడా పెద్దగా అవకాశాలు రాకపోవటంతో చేసేదేమీ లేక సోషల్ మీడియాలో టైమ్ పాస్ చేస్తోంది. కొంత కాలం బాయ్ ఫ్రెండ్‌తో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ బ్రేకప్‌ తరువాత డిప్రెషన్‌లోకి పోయింది.

 

ఈ మధ్యే కోలుకున్న ఈ బ్యూటీ సినిమాల మీద దృష్టి పెట్టింది. చివరగా అనీస్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కిన పాగల్‌పంతి సినిమాలో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం అభిషేక్‌ బచ్చన్ లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న బిగ్‌బుల్‌ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా 1992లో జరిగిన బిగ్గెస్ట్ సెక్యూరిటీ స్కామ్‌ నేపథ్యంలో రూపొందుతుంది. తాజాగా ఈ భామ తన సోషల్ మీడియా పేజ్‌లో ఇంట్రస్టింగ్ పోస్ట్‌ను షేర్ చేసింది. జోష్‌లో ఎంజాయ్ చేస్తున్న వీడియోను షేర్ చేసిన ఇల్లి బేబీ ఫర్‌ ఎవర్‌ మూడ్‌ అంటూ కామెంట్ చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Forever mood. Well...90% of the time 🤷🏻‍♀️ #goofball #cantstopwontstop 🎥 @namrata_h ✨

A post shared by ileana D'Cruz (@ileana_official) on

మరింత సమాచారం తెలుసుకోండి: