వివాదాలనే సినిమా కథాంశాలుగా ఎంచుకుని, పబ్లిసిటీ కోసమే అలాంటి కథల్ని ఎంచుకుంటున్నానంటూ చెప్పే వర్మ, కరోనా కాలంలోనూ సినిమాలని తెరకెక్కించడం వదలడం లేదు. కరోనా సమయంలో బయటకి వెళ్దామంటేనే కష్టంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాల షూటింగులు చేయడమే కాదు, వాటికోసం ప్రత్యేకంగా ఏటీటీ ( ఎనీ టైమ్ థియేటర్) అనే నూతన కాన్సెప్టుతో ముందుకు వచ్చాడు.

 

 

అయితే ఇప్పటి వరకు ఏటీటీ ద్వారా రెండు చిత్రాలని రిలీజ్ చేసాడు. క్లైమాక్స్, నగ్నం అనే సినిమాలని ఏటీటీ ద్వారా రిలీజ్ చేసి, వాటిని చూడడానికి టికెట్ పెట్టాడు. పే పర్ వ్యూ పద్దతిలో స్టార్ట్ చేసిన ఈ కొత్త ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది. ఫలితంగా వర్మ జేబుల్లోకి కోట్లు వెళ్ళాయి. అయితే ఇప్పటి వరకు సినిమా చూడడానికే ఫీజు వసూలు చేసిన వర్మ తాజాగా ట్రైలర్ చూడడానికి కూడా ఛార్జ్ వసూలు చేయనున్నాడట.

IHG

 

పవర్ స్టార్ అనే పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న వర్మ, ఈ ట్రైలర్ చూడడానికి ఫీజు చెల్లించాలని చెబుతున్నాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ పై విమర్శనాత్మకంగా తెరకెక్కుతుందని క్లియర్ గా అర్థమవుతున్న ఈ సినిమాని మరికొద్ది రోజుల్లో రిలీజ్ చేస్తాడట. అయితే దానికి ముందు ట్రైలర్ ని వదులుతాడు. కానీ ఆ ట్రైలర్ ని చూడాలన్నా డబ్బులు చెల్లించాడని చెప్పడమే ఆశ్చర్యంగా ఉంది.

 

 

అయితే సాధారణంగా వర్మ చాలా సినిమాల ట్రైలర్లని వదులుతూ సినిమాల గురించి మర్చిపోతుంటాడు. అవి కేవల ట్రైలర్ పర్పస్ లోనే తీసాడని కూడా అంటారు. అయితే ఇక్కడ కూడా అలానే జరగనుందేమో అని అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: